విలక్షణ శీర్షికలతో తెలుగు వారి లోగిళ్లలో వెలుగులు నింపుతున్న తెలుగుపత్రిక ఆరంభమైన అచిరకాలంలోనే అందరి ఆదరాభిమానాలను చూరగొంది. పది నెలల పాటు విదేశీ గడ్డపై తెలుగు సౌరభాలను విరజిమ్మింది. అయితే, పత్రికను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలుగుపత్రిక బృందం ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. ‘పత్రిక ఎలా ఉంది?’, ‘ఇంకా ఎటువంటి శీర్షికలు కావాలని కోరుకుంటున్నారు?’, ‘పాఠకుల ఆసక్తులు, అభిరుచులు ఏమిటి?’ తదితర అంశాలపై పాఠకుల నాడిని కనుగొనే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పాఠకులను ముఖాముఖీ కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. అత్యధికంగా దాదాపు 75 శాతం మంది పిల్లల కథలు, ఆటపాటలు, వారికి భాషా పరిజ్ఞానాన్ని నేర్పే శీర్షికలు ఉండాలని కోరుకున్నారు. అలాగే, 63 శాతం మంది మహిళలకు సంబంధించిన శీర్షికలు, అంటే- వ్రత కథలు, తెలుగింటి వంటలు, పురాణాలు, ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రల ఔన్నత్యాన్ని తెలిపే శీర్షికలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ముందు నుంచీ పాఠకుల అభిరుచికి అనుగుణంగా నడుస్తున్న తెలుగు పత్రిక పాఠకుల సలహా సూచనల మేరకు వినూత్న రీతిలో రూపుదిద్దుకోనుంది. ఇక నుంచీ ప్రతి నెలా ఒక ‘ప్రత్యేకత’తో తెలుగు పత్రిక వెలువడనున్నది. ఇందులో భాగంగా నవంబరు సంచిక పిల్లల ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. తెలుగు భాషా జ్ఞానంపై అవగాహన కలిగించే రీతిలో ముప్పై రెండు పేజీల (రెగ్యులర్ శీర్షికలు కాకుండా)తో చిన్నారులను, పెద్దలను అలరించే వివిధ శీర్షికలతో నవంబరు సంచిక మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ముస్తాబైంది. పెద్ద మనసుతో ఆయా శీర్షికలను చదివి, మరిన్ని సలహా సూచనలు ఇవ్వండి. మీ అభిప్రాయాలు తెలపండి. మీరు కోరుకున్న శీర్షికలకే, మీ అభిరుచులకే తెలుగుపత్రిక పెద్దపీట వేస్తుంది. ఇకపై రానున్న ప్రతి సంచిక కూడా ఒక ప్రత్యేకతతో మిమ్మల్ని అలరించనుం
Review తెలుగుపత్రిక.. ఇకపై సరికొత్తగా...