భారతీయ సంస్క•తిని మనం భూతద్దంలో చూడటం లేదు. చిన్న అద్దంలో చూస్తున్నాం. ఔను. ‘భారతీయ సంస్క•తి’ అనే కొండను మనం చిన్న చేతి అద్దంలో చూస్తున్నాం. అంటే, చాలా తక్కువ చేసి చూస్తున్నాం. ఆడంబరంగా ప్రదర్శించకుండా, మనకు మనం తగ్గించుకుని వినమ్రంగా చూస్తున్నాం. మేరు పర్వతం వంటి మన సంస్క•తిని మన సంస్కారంతో, ఆడంబరంగా ప్రదర్శించకుండా వినమ్రతను ప్రదర్శిస్తున్నామా; ఆ రకంగా దాని గొప్పదనాన్ని మరింత పెంచి చూపిస్తున్నామా? లేక దాని ఔన్నత్యాన్ని గ్రహించకుండా దాని పట్ల తేలిక భావాన్ని కలిగి ఉన్నామా?
మన నేల గొప్పదనాన్ని, మనదైన సంస్క•తిని, సంప్రదాయాల విశిష్టతను మనం గుర్తించడం లేదంటే, మీదు మిక్కిలి లోకువ భావాన్ని కలిగి ఉన్నామంటే దానికి ముఖ్యమైన కారణాలు మూడు. అవి-
1. మన సంస్క•తి గొప్పదనం మన దృష్టిలోకి రాకపోవడం, దానిపై అవగాహన లేకపోవడం.
2. సంస్క•తిని దూరం చేసుకుంటే ఏం కోల్పోతామో ఆ పరిణామాలపై అంచనా లేకపోవడం.
3. మనం ఆకర్షితమవుతున్న, మనకు అతకని విదేశీ సంస్క•తి వల్ల ఎటువంటి దుష్పరిణామాలు కలుగుతాయనేది గ్రహించలేకపోవడం.
సంస్క•తి అనేది ఎవరో ఒక వ్యక్తి ఏర్పాటు చేసినది కాదు. అదొక చట్టం కాదు. దేశ, కాల, మాన, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలక్రమేణా జాతికి అలవడిన అనుకూల జీవనశైలియే మన సంస్క•తి.
ఉదాహరణకు ఐరోపా దేశాల్లో చలి ఎక్కువ. మంచు కురుస్తూ ఉంటుంది. దీంతో వారంతా ఎప్పుడూ తలుపులు బంధించుకుని ఉంటారు. నిప్పుగూళ్లు రాజేసుకుంటారు. మనది సమశీతోష్ణ దేశం. సహజమైన గాలి, వెలుతురు ప్రసరించే భాగ్యదేశం. పగలు మనం ఆ దైవదత్త అవకాశాన్ని ఆస్వాదించగలం. ఆనందించగలం. ఇంకా వస్త్రధారణ, వివాహ వ్యవస్థ.. ఇలా మనకు, ఇతరులకు ఎంతో భిన్నంగా ఉంటాయి.
మనది ఆధ్యాత్మిక దేశం. మన భావజాలానికి, ఆత్మోన్నతికి తగిన జీవన విధానాన్ని మన పెద్దలు ఏనాడో అమర్చి పెట్టారు. దానినే మనం అనుసరించాలి. ఆధునికత పేరిట అనాగరికతను అలవరచుకోరాదు. ఆధునికత అనేది బాహ్య ఆడంబరాలతో వ్యక్తమయ్యేది కాదు. భావ ఔన్నత్యంలో ప్రస్ఫుటమయ్యేది. మంచి ఎక్కడున్నా అది అనుసరించాల్సిందే. కానీ గుడ్డిగా మనది కానిదల్లా మనది చేసుకోరాదు. అందంగా లేదని అమ్మ అమ్మ కాకుండాపోదు. అమ్మలోని అంతర్గత సౌందర్యాన్ని మనం చూడగలగాలి. దానిని అవగాహన చేసుకోనిదే అమ్మలోని సౌందర్యాన్ని మనం చూడలేం. అమ్మను నిర్లక్ష్యం చేయకూడదు. మన ప్రవర్తనతో అమ్మను దూరం చేసుకోకూడదు. మన సంస్క•తి కూడా అమ్మ వంటిదే. మనం అమ్మను ప్రేమించలేనిదే మన సంస్క•తినీ ప్రేమించలేం.
Review మన సంస్క•తి.. మన ఘనకీర్తి.