
మన సంప్రదాయాల ప్రతిబింబం
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికను ఇటీవల అనుకోకుండా ఆన్లైన్లో చూడటం జరిగింది. ఏముందో అని రెండు మూడు పేజీలు స్క్రోల్ చేశా.. ఇక ఆ తరువాత ఆగలేదు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివా. ఫీచర్లు చాలా బాగున్నాయి. పిల్లలు, పెద్దలకు మాత్రమే అని కాకుండా అందరికీ పనికి వచ్చే, ఉపకరించే శీర్షికలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా మన భారతీయ సంస్క•తీ సంప్రదాయాలకు, అందునా తెలుగింటి సంప్రదాయాలకు తెలుగు పత్రిక ప్రతిబింబంగా నిలుస్తుందనిపించింది. ఈ రోజుల్లో ఇంత సంప్రదాయబద్ధంగా వస్తున్న పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కీపిటప్.
– వెంకట్.ఆర్., ఉషాకిరణ్.హెచ్.-అట్లాంటా, లక్ష్మణ్, సంతోష్, లక్ష్మి, అనిల్‌కుమార్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
విదేశాల్లో భారతీయ ఆలయ విశేషాలు
మన భారతీయ సంప్రదాయ రీతుల్లో వివిధ దేశాల్లో ఆలయాలు వెలుస్తున్నాయి. ఇవెంతగానో పేరు ప్రఖ్యాతులను సాధిస్తున్నాయి. ఇటువంటి ఆలయాల గురించి ప్రతి సంచికలో ఒక్కటి చొప్పున ప్రచురిస్తే బాగుందనేది మా అభిప్రాయం. ఆలయ నిర్మాణ విశేషాలు, ఆలయ నిర్మాణానికి ఎలా ముందడుగు పడింది తదితర వివరాలను సోదాహరణంగా అందిస్తే భారతీయులందరికీ గర్వకారణంగా ఉంటుంది. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల నలుమూలలా నేడు భారతీయ హిందూ దేవాలయాలు అలారారుతున్నాయి. ఇటువంటి ఆలయాల గురించి వీలును బట్టి పరిచయం చేయగలరని మనవి.
– కేవీ నరసింహారావు-హైదరాబాద్, వినుకొండ ప్రమీల్- కర్నూలు, వినయ్, రాజీవ్, రామకృష్ణ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
ఆధ్యాత్మిక జీవనం
గత సంచికలో ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం ఎంతో బాగుంది. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో, ఒడి దుడుకుల పయనంలో ఆధ్యాత్మికత అనేది ఎంత అవసరమో చక్కగా తెలిపారు. పోటీలో పడి కొట్టుకు పోతున్న మనుషులు ఒక్క క్షణం ఆగి తమను గురించి తాము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-ఆర్.కిషోర్, నర్సింహరాజు, భిక్షపతియాదవ్- •
Review ఉత్తరాయణం.