ఉత్తరాయణం

సాయిబాబా గురించి ఇవ్వండి..

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో షిర్డీ సాయిబాబాకు సంబంధించి కూడా ఏదైనా ఒకటి రెండు శీర్షికలు ప్రవేశపెట్టాలని మా విన్నపం. బాబా సూక్తి ఒకటి ఇస్తున్నారు కానీ ఏదైనా ప్రత్యేక శీర్షిక కూడా ఉంటే బాగుంటుందని అనిపిస్తోంది. ఎందుకంటే బాబాకు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్దసంఖ్యలో భక్తులు ఉన్నారు. కాబట్టి అందరి కోసం సాయిబాబాకు సంబంధించి ఒక శీర్షిక (ఏదైనా) ప్రవేశపెట్టగలరని కోరిక.
– రాజ్‍.సి.- అట్లాంటా, వెంకటేశ్‍ ప్రసాద్‍- విజయవాడ, నవీన్‍కుమార్‍, బి.సంతోష్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు.

ఎడ్యుకేషన్‍..

తెలుగు పత్రిక అంతర్జాతీయ మాసపత్రికలో ప్రతి నెలలో వచ్చే ఆయా ముఖ్య దినాలు (డేస్‍) గురించి ప్రముఖంగా ఇవ్వడం బాగుంది. దీనివల్ల పత్రికకు కరెంట్‍నెస్‍ వచ్చినట్టయింది. అలాగే, పాఠకులకు అటాచ్‍మెంట్‍ పెరుగుతుంది. ముఖ్య దినాల ప్రాముఖ్యత గురించి తెలియ చెప్పినట్టవుతుంది. ఇక మునుముందు కూడా ఇలాగే ఆయా ముఖ్య దినాల గురించి కవర్‍ చేయండి. ఫలితంగా పాఠకులు అన్ని విధాలుగానూ ఎడ్యుకేట్‍ అవుతారు. తెలుగు పత్రిక ద్వారా మన సంస్క•తీ సంప్రదాయాల పరిరక్షణకు చేస్తున్న కృషి ఎనలేనిది. ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని మా విజ్ఞప్తి.
-రాంప్రసాద్‍, విశాఖపట్నం, తేజ్‍.సీహెచ్‍., టెక్సాస్‍- వనజ- హైదరాబాద్‍, కిషోర్‍కుమార్‍, విజయవాడ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

విలువైన సమాచారం

‘తెలుగుపత్రిక’లో అందిస్తున్న ఆధ్యాత్మిక వికాసం శీర్షిక చాలా బాగుంటుంది. మన పురాణాలు, ఇతిహాసాలలోని కథలను బేస్‍గా తీసుకుని వ్యక్తిత్వ వికాసం గురించి వివరిస్తున్న తీరు బాగుంది. ఈ శీర్షిక కింద అటువంటి విలువైన సమాచారాన్ని మరింతగా అందించండి. తెలుగు భాష, సంస్క•తులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి ఈ రోజుల్లోనూ ఇంతగా అందిస్తున్న ‘తెలుగు పత్రిక’ కృషి అభినందనీయం. విదేశాల నుంచి ఇంతటి విలువైన సమాచారంతో ఒక తెలుగు భాషా పత్రిక వెలువడుతోందంటే ఆశ్చర్యంగా ఉంది.
– రాజేష్‍- కాకినాడ, శంకర్‍ప్రసాద్‍- తిరుపతి, రవికిషోర్‍, నాగేశ్వరరావు.పి., లేపాక్షి, బాలసుబ్రహ్మణ్యం- విశాఖపట్నం

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top