మాతృ హృదయం
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అందించిన కథనం ఎంతో బాగుంది. అమ్మను కోణంలో పరిచయం చేసిన తీరు బాగుంది. మాతృమూర్తి ఔన్నత్యాన్ని అభివర్ణించడంతో పాటు సినిమా పాటల్లో, నిత్య జీవితంలో ఆమె పాత్ర గురించి వివరించిన తీరు హృద్యంగా ఉంది. చాలా రోజుల తరువాత చక్కని, చిక్కని కథనం చదివిన ఫీలింగ్ కలిగింది. ఈ కథనం ఎంతో బాగుంది. మరియు జై జై శంకరాచార్యులు గురించి అందించిన కథనం కూడా ఎంతో బాగుంది. ఇటువంటి మంచి కథనాలు అందించినందుకు ధన్యవాదాలు.
-హిమబిందు, ఎన్.సుధాకరరావు, కె.వి.రంగనాథ్, పైడి గురునాథ్, ఆర్.సత్యనారాయణ, విశేష్, సంకల్ప్ (హైదరాబాద్ నుంచి)
అమ్మ ఔన్నత్యం..
సినీ కవి వేటూరి సుందరరామమూర్తి గారి ‘మర్మ స్థానం కాదది.. నీ జన్మ స్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్య క్షేత్రం’ అంటూ రాసిన ఒక పాటలోని పాదం గురించి కథనంలో అమ్మ గురించి వివ రించడం బాగుంది. తల్లిగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని ఇంతకన్నా గొప్పగా వర్ణించలేమేమో!. అలాగే పురాణ కాలంలో తల్లి పాత్ర గురించి, సినీ సాహిత్యంలో తల్లి గొప్పదనం గురించి, ఆధునిక కాలంలో ఆమె పోషి స్తున్న, పోషించాల్సిన పాత్ర గురించి చక్కగా విశ్లే షించారు. ఒకప్పుడు వంటింటిలో గృహిణి పాత్రకే పరిమితమైన అమ్మ ఇప్పుడు దశదిశలా తన ఔన్నత్యాన్ని చాటడానికి చేస్తున్న ప్రయత్నాలు ఆలోచింప చేశాయి.
-రమ్యకుమారి, వినోద్‍కుమార్, పి.నంద గోపాల్, బ్రహ్మాజీ, ఆర్.విఠల్, కనకలక్ష్మి, ఎ.అభి రామ్ మరికొందరు పాఠకులు (ఈ-మెయిల్ ద్వారా)
వ్రత కథలు మరిన్ని..
మన హిందూ సంప్రదాయంలో అనేక పూజలకు, వ్రతాలకు పెద్దపీట వేశారు. ఆయా వ్రతాలను ఏయే సందర్భాలలో ఆచరించాలి? ఎలా ఆచరించాలి? ఏ సమయంలో చేయాలి? ఆయా వ్రతాల ఫలితా లేమిటి? అనేది ప్రతి శీర్షికలో వివరంగా ఇవ్వాలని మనవి. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తెలుగు వారికి ఇటువంటివి అత్యంతావశ్యం. ఇటువంటివి చదివి ఆచరించడానికి మరెందరికో దారి చూపినట్టవు తుంది. కాబట్టి వ్రత కథల గురించి ఎక్కువ వివరాలు అందించండి.
-కిషోర్- ఎమ్మిగనూరు, రాంగోపాల్- విశాఖ•
Review ఉత్తరాయణం.