సమకాలీన అంశాలపై..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో అన్ని విషయాలను చర్చిస్తున్నారు. ముఖ్యంగా సంస్క•తీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తెలుగు భాష విశేషాల గురించి విశేష రీతిలో వివరాలు అందిస్తున్నారు. సంతోషం. ఎంతైనా అభినందనీయం. అలాగే, సమకాలీన, వర్తమాన అంశాలను కూడా క్లుప్తంగానైనా టచ్ చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. అటు తెలుగు రాష్ట్రాలలో, ఇటు విదేశాలలో చోటుచేసుకుంటున్న ముఖ్య పరిణామాలపై విశ్లేషణ మాదిరి అందిస్తే ఎంతైనా బాగుంటుంది. అన్ని విషయాల్లోనూ అందరినీ ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది. ఆ దిశగా ప్రయత్నించండి.
-ఆర్.ఆర్.మహి- అట్లాంటా, రాజ్‍కిరణ్.పి.- టెక్సాస్ (ఈ-మెయిల్ ద్వారా), రాణిదేవి, సంతోష్‍కుమార్- హైదరాబాద్, కె.నాగేశ్వరరావు- వరంగల్, తిరునగరి సదాశివరావు- తిరుపతి మరికొందరు పాఠకులు
నాన్నకు ప్రేమతో..
చిన్నగానైనా ఫాదర్స్ డే సందర్భంగా అందించిన సింగిల్ పేజీ ఆర్టికల్ బాగుంది. ఎవరి జీవితంలోనైనా తండ్రి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. అటువంటి విశిష్ట పాత్రకు గల గొప్పదనాన్ని క్లుప్తంగానైనా బాగా వర్ణించారు. అలాగే పేరెంటింగ్‍లో భాగంగా తండ్రుల పాత్ర, పిల్లల పట్ల అతను నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి పది పన్నెండు పాయింట్లు రూపంలో వివరించడం బాగుంది. ఆధ్యాత్మిక వికాసం, మాస విశేషం, పలుకుబడి, సామెతలు వంటి శీర్షికలు ‘తెలుగు పత్రిక’ మొత్తానికే హైలైట్. ఇంకా మరిన్ని అలరించే విశేషాలతో ప్రతి మాసం తెలుగు పత్రిక వెలువడాలని కోరుకుంటున్నాం.
-దశరథ రజువా- ఖమ్మం, వి.వెంకటేశ్వర రావు – హైదరాబాద్, నీలం వెంకట్, రాజశేఖర్, భిక్షపతి గౌడ్, నవీన్ కులకర్ణి, కఠారి మహేశ్‍బాబు, కిశోర్‍కుమార్, బీరప్ప యాదవ్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
వికాస తరంగిణి
ఆధ్యాత్మిక వికాసం శీర్షికలో అందిస్తున్న విషయాలు ఈ కాలానికి తగినట్టుగా ఉన్నాయి. మన భారతీయ ఇతిహాస గ్రంథాలలోని విషయాలను సంగ్రహించి ఈ కాలానికి తగినట్లుగా అందిస్తున్న తీరు అభినందనీయం. వ్యక్తిత్వ వికాసానికి ఇటువంటి శీర్షికలు దోహదపడతాయి. అలాగే, తెలుగు పత్రికలో అందిస్తున్న ఇతర శీర్షికలు కూడా చదివిస్తున్నాయి.
-కనిగిరి ఆనంద్‍కుమార్- విజయవాడ, కేశవశర్మ- హైదరాబాద్, కురుగడ్డ పావని- హన్మకొండ
Review ఉత్తరాయణం.