వినాయక వైభవం
సెప్టెంబరు మాసం తెలుగు పత్రికలో వినాయక చవితి విశేషాలపై ఇచ్చిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అందులో చెప్పిన విషయాలు కొత్తగా అనిపించాయి. అలాగే, భాష, సంస్క•తి, సంప్రదాయాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఆరోగ్య భాగ్యం శీర్షికన అందిస్తున్న ఆయుర్వేద వైద్య విశేషాలు చదివిస్తున్నాయి.
– రామకృష్ణ- భీమవరం, నర్సింహారావు- విజయవాడ, క్రిష్.ఆర్- అట్లాంటా, రఘునందన్-హైదరాబా•
ఆధునికం.. సంప్రదాయం
తెలుగు పత్రిక అటు ఆధునికం.. ఇటు సంప్రదాయ బద్ధమైన శీర్షికలు అందిస్తూ అందరికీ వారధిగా నిలుస్తోంది. ఇందులోని విషయాలు అందరూ తెలుసుకో దగినవి. మరోపక్క భాషా వికాసం కోసం చేస్తున్న కృషి కూడా అభినందించదగినది. తెలుగు పత్రిక తెలుగు వారి కరదీపిక కావాలి.
-టి.వెంకటరావు-తిరుపతి, మహీపాల్- హైదరాబాద్
Review ఉత్తరాయణం.