ఉత్తరాయణం

పిల్లల పెంపకం
నవంబరు మాసం తెలుగు పత్రికలో బాలల దినోత్సవం సందర్భంగా, బాల్యం.. తల్లిదండ్రుల పెంపకంపై ఇచ్చిన వివిధ అంశాలు చాలా బాగు న్నాయి. ఇవి నిజంగా నేటి తరం తల్లిదండ్రులను, పిల్లలను కూడా ఆలోచింప చేస్తాయి. పిల్లల మనసు ఎలా తెలుసుకోవాలి? వారి అభిరుచులు, ఆసక్తులు ఏమిటి? వారితో ఎలా గడపాలి? అనే విషయాలు చాలా వివరంగా అందించారు. ప్రతి పేరెంట్స్ తప్పక చదవాల్సిన ఆర్టికల్‍ ఇది. ఇటువంటివే మరిన్ని విలువైన శీర్షికలు మునుముందు కూడా తెలుగుపత్రికలో అందించగలరు.
– పి.నాగేశ్వరరావు, కరుణాకర్‍, ఆర్‍.సత్యనారాయణ, లక్ష్మీగౌతమి, వై.లలిత, ఎస్‍.కామేశ్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
యాత్రా విశేషాలు
తెలుగు పత్రికలో ఆధ్యాత్మిక యాత్రలు, పుణ్య క్షేత్రాల యాత్రల గురించి కూడా వివరాలు అందిస్తే బాగుం టుంది. ఆయా యాత్రలు ఎలా చేయాలి? అక్కడి విశేషాలేమిటి? ఆయా పుణ్యక్షేత్రాల సందర్శన ద్వారా ఎటువంటి అనుభూతిని పొందారు అనే వివరాలను ఆయా యాత్రికుల ద్వారా చెప్పిస్తే అది మరెందరికో విలువైన సమాచారాన్ని అందించినట్టవుతుంది. ఈ దిశగా శీర్షికను ప్రవేశపెట్టగలరని ఆశిస్తున్నాం. అలాగే, ప్రముఖ ఆలయాల్లో దర్శన వేళలు, ప్రత్యేక పూజల వివరాలను ప్రతి నెలా అందించే ప్రయత్నం చేయాలి.
– పి.రామచంద్రరావు, హైదరాబాద్‍
ఆధునిక వంటలు
తెలుగు పత్రికలో సూపర్‍ డిష్‍ పేరుతో ఆధునిక వంటకాల గురించి ఇస్తున్నారు. ఇవన్నీ తేలికగా ఇంట్లో చేసుకోదగినవే. అయితే, పాత కాలం నాటి వంటకాలను, వాటి తయారీ విధానాలను గురించి కూడా వివరాలు అందిస్తే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతం నాటి కాలపు వంటలేవీ ఇప్పుడు అందు బాటులో లేవు. షాపుల్లో అమ్మకానికి మాత్రమే లభిస్తు న్నాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లోనే తయారు చేసుకుని ఆరగించిన అటువంటి వంటకాలను ఎవరికి వారు ఇంట్లోనే తయారు చేసుకునేలా ఈ శీర్షిక కింద వివరాలు అందిస్తే బాగుంటుంది. అలాగే మన పాత తరం వంటకాలు, తినుబండా రాల్లో పోషక విలువలు కూడా ఎక్కువే. వాటిని తినడం వల్ల కలిగే లాభాలు, పిల్లలకు, పెద్దలకు లభించే ఆరోగ్యం వంటి వివరాలను కూడా ఇవ్వచ్చు.
-రాజమణి-హైదరాబాద్‍, టి.సత్యకిశోర్‍, సతా

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top