ఎన్నెన్నో వర్ణాలు..
తెలుగు పత్రిక మార్చి సంచికలో హోలీ పర్వాన్ని మానవ జీవితాలకు అన్వయిస్తూ అందించిన కథనం చాలా బాగుంది. హోలీ నాడు కనువిందు చేసే రంగులు, ప్రకృతి ఈనాటికి సంతరించుకునే వర్ణాలు.. అవి మన మనోవికాసంపై చూపే ప్రభావం గురించి బాగా వివరించారు. మన పండుగలు, పర్వాల వెనుక ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే.. మన పూర్వీకులు ఎంత దూరదృష్టితో వాటికి ఆనాడు రూపకల్పన చేశారో అర్థమవుతుంది.
– ఎన్.వరదాచారి- తిరుపతి, నవీన్‍కుమార్-హైదరాబాద్; శ్యామ్.కె.- టెక్సాస్, రాజమణి- గుంటూరు, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
శివరాత్రి
ప్రతి సంవత్సరం వచ్చే పండుగలు, పర్వాల గురించి ఆధ్యాత్మిక, మానసిక వికాస కోణంలో విశ్లేషించడం బాగుంది. ప్రత్యేకించి మార్చి సంచికలో శివరాత్రి గురించి అందించిన విశ్లేషణ, వివరాలు చదివించాయి.
– రామేశ్వరరావు, నగేశ్, వివేకానంద, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
లేఖలు
తెలుగు పత్రికలో అందిస్తున్న శ్రీరామ్ గారి లేఖలు చాలా ఆర్ధ్రతతో మనసును కదిలించేలా ఉంటున్నాయి.
– లావణ్య, విజయవాడ
Review ఉత్తరాయణం.