
భీష్మ నీతి
కళ్లెదుట అన్యాయం జరుగుతుందని తెలుసు.. కానీ, దుర్యోధనుడి ఉప్పు తిన్న పాపానికి పాండవులకు న్యాయం చేయలేని దైన్యం.. అంపశయ్యపై మృత్యువు కోసం ఎదురుచూపు.. చివరకు ధర్మం నెరిగిన భీష్మ పితామహుడు పాండవులకు రాజనీతిని, రాజధర్మాలను బోధించిన తీరు అమోఘం. తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన భీష్మ ఏకాదశి పర్వాల విశేషాలు ఎంతగానో బాగున్నాయి.
– విజయ్‌భాస్కర్, చందుపట్ల వెంకట మోహన్‌కృష్ణ, ఎస్.రామ్మోహనరావు, ఎస్ఎస్ఆర్ అనిల్‌కుమార్, శశిధర్, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
అమోఘం..
తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో ప్రతి పేజీలో అందించిన సూర్య భగవానుడి విశేషాలు బాగున్నాయి. మాఘ మాసం స్నానాల ప్రాముఖ్యం, రథ సప్తమి సంగతులు చదివి కొత్త విషయాలు తెలుసుకున్నాం. ప్రతి సంచికను ప్రత్యేకంగా తీసుకువస్తున్నందుకు అభినందనలు.
– కృష్ణమిలన్- అట్లాంటా, మాధవరావు- విశాఖపట్నం, ధర్మసాగర్- హైదరాబాద్,
మాఘ రామాయణం
రామాయణంలోని ముఖ్య ఘట్టాలన్నీ మాఘ మాసంలోనే చోటుచేసుకున్నాయనే వివరాలు బాగున్నాయి.
– చంద్రశే•ర్, తిరుపతి
Review ఉత్తరాయణం.