
యాదాద్రి వైభవం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృషింహ స్వామి వారి క్షేత్ర విశేషాలు, కొత్త ఆలయ పునర్నిర్మాణ గురించిన విశేషాలతో వెలువడిన మే 2022 తెలుగుపత్రిక సంచిక ఎంతో బాగుంది. ఆలయ పునర్నిర్మాణంలో వాడిన శిలలు, వాటిని ఎక్కడి నుంచి సేకరించారు?, పంచతల రాజగోపురాల గురించి విశేషాలు చదివించాయి.
– కేఆర్ రామ్మోహనరావు, పి.చంద్రశేఖర్, సి.కోటేశ్వర్, కొత్తకోట వెంకటేశ్, టి.రాంగోపాల్, ప్రభాకరశర్మ, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
బ్రహ్మానందం
మనిషి కోరుకునేది ఆనందమే. అయితే ఆ ఆనందం ఎటువంటిదనేది ముఖ్యం. విషయానందం, విద్యానందం, బ్రహ్మానందం గురించి పిట్టకథలతో వివరించిన తీరు బాగుంది. మే తెలుగు పత్రిక సంచికలో అందించిన ఈ ఆధ్యాత్మిక వికాసం శీర్షిక అలరించింది.
– రాజగోపాలం, కడలి గోపాలకృష్ణ, మహేశ్వరరావు, టి.షర్మిల, కె.బాపూరావు, కేఆర్ సంతోష్‌కుమార్- హైదరాబాద్
ప్రతి పేజీలో..
తెలుగు పత్రిక ప్రతి పేజీలో అందిస్తున్న ప్రత్యేక విశేషాలు చదివిస్తున్నాయి. ఆయా దినోత్సవాలు, ముఖ్యమైన రోజులపై వివరణ బాగుంది.
– శంకర్, విజయవాడ
‘‘డబ్బు, పరపతి, సంపత్తి, అధికారం.. ఇవన్నీ అద్దెకుండేవి మాత్రమే.
ఇల్లు మారుతూ ఉంటాయి. చిరునవ్వు, ఆత్మీయత, ప్రేమ..
ఇవి మాత్రమే సొంతమైనవి. ఇవి ఉన్నచోటనే ఉంటాయి’’
– శ్రీ షిర్డీ సాయిబాబా
Review ఉత్తరాయణం.