
ఆరోగ్య అవగాహన
మనకు తెలియకుండానే మన శరీరంలో చేరి మనల్ని నీరసపరిచే క్రిముల గురించి జూన్-2022 తెలుగు పత్రిక సంచికలో మంచి అవగాహన కలిగించారు. ప్రాచీన ఆయుర్వేదంలో విశేషాలను అందిస్తున్నందుకు అభినందనలు.
– ఎస్.కైలాస్, హైదరాబాద్, పాముల విశేష్, తిరుపతి
గాయతి్ర నమస్తుభ్యం
వేదమాత గాయత్రి గురించి మునుపు తెలియని విశేషాలను చక్కగా వివరించారు. ఆమె అవతార ప్రాశస్త్యం, గాయత్రి మంత్రంతో పాటు ఇరవై నాలుగు దేవతలతో కూడిన మంత్రాలను, వాటి భావార్థాన్ని వివరించడం బాగుంది. గతంలో తెలియని చాలా విషయాలను తెలుసుకున్నాం.
– ఆర్.ఎస్.రామ్, టెక్సాస్, ఎన్.కేసరి, అట్లాంటా, పి.రవిచంద్ర, గౌతమి, పెనుమత్స రాజారావు, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
అవీ.. ఇవీ
తెలుగు పత్రికలో పురాణ పాత్రలు, మహర్షుల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి.
– పీఆర్ సుదర్శన్, హైదరాబాద్
ఇంటర్వ్యూ
సినిమా పేజీలో కథానాయికల ఇంటర్వ్యూలు
బాగుంటున్నాయి. మూవీ అప్డేట్స్ పెంచాలి.
– సి.చంద్రశేఖర్, విశాఖ
Review ఉత్తరాయణం.