గురువులకే గురువు
తెలుగు పత్రిక జూలై సంచికలో గురుపూర్ణిమ సందర్భంగా దక్షిణామూర్తి గురించి ఇచ్చిన వివరాలు బాగున్నాయి. ఆయన గురువులకే గురువు. ఆయన రూప విశేషాలు, మూర్తిమత్వం గురించి మంచి వివరాలు అందించారు.
– సి.రాధాకృష్ణమూర్తి, ఆర్.రవిచందర్, పి.సుభాష్, రమేశ్చంద్ర, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
ప్రకృతి పాఠం
జూలై సంచికలో ఆధ్యాత్మిక వికాసం శీర్షిక కింద ప్రకృతి నుంచి మనిషి నేర్వాల్సిన విషయాలను దత్తాత్రేయుడు వివరించిన వైనం బాగుంది. ప్రకృతిని మించిన పరమ గురువు లేరు.
– ఎం.రామచంద్రరావు- హైదరాబాద్, ఆర్.రాజేశ్వరి-తిరుపతి, ఎ.రామకృష్ణ- కనిగిరి, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
మైండ్ఫుల్నెస్పై..
తెలుగు పత్రిక జూలై సంచికలో హెపటైటిస్ లక్షణాలు, అది మనపై చూపించే ప్రభావం, చికిత్స విధానాల గురించి చాలా వివరంగా ఇచ్చారు. అలాగే, ఆరోగ్యభాగ్యం శీర్షిక కింద మానసిక సమస్యలపై కూడా నిపుణుల సలహా సూచనలతో వివరాలు అందించండి. ఎందుకంటే ఇప్పుడు జనం శరీరానికి వచ్చే ఆరోగ్య సమస్యల కంటే మానసికంగానే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు.
– కె.రామారావు, హైదరాబాద్
Review ఉత్తరాయణం.