
స్వాతంత్య్రం వచ్చెనని
తెలుగు పత్రిక ఆగస్టు సంచికలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల గురించి ఇచ్చిన ప్రత్యేక కథనం బాగుంది. అలాగే, నాటి స్వాతంత్య్రోద్యమంలో మన తెలుగు ప్రముఖుల కవితా ఉద్యమం గురించి, ఉత్తేజపరిచే వారి కవితా ఫంక్తులు ఇవ్వడం చదివించాయి. ఈ డెబ్బై ఐదేళ్లలోని ముఖ్య ఘట్టాలను పేర్కొనడం బాగుంది.
– నాగేశ్వరరావు-హైదరాబాద్, రాంప్రసాద్, కె.విష్ణువర్దన్‌రెడ్డి, పీఆర్ కిశోర్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
ప్రత్యేకం
ఆగస్టు సంచికలో శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి గురించి ఒకేచోట సంక్షిప్తంగా వివరించడం బాగుంది. అలాగే శ్రావణ మాసంలో ఆచరించే వివిధ వ్రతాలు, ఈ సందర్భంగా తయారు చేసుకునే నైవేద్యాల్లోని ఆరోగ్య రహస్యాల గురించి చదివించే వివరాలు అందించారు.
– పొనుగోటి రవి- హైదరాబాద్, ఆర్.త్రినాథ్‌రావు-తిరుపతి, వైఆర్ రాజేశ్, కావ్య- విజయవాడ
నవజీవనం
మనం సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నా.. నిజ జీవితంలో మాత్రం శాంతియు తంగా బతలేకపోతున్నామనే విషయాన్ని ఆధ్యాత్మిక వికాసం శీర్షికలో బాగా చెప్పారు.
– పి.మహేశ్-విశాఖపట్నం
Review ఉత్తరాయణం.