
ఆలోచింపచేశాయి..
నేడు ప్రపంచంలో పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో తెలుగు పత్రిక డిసెంబరు- 2022 సంచికలో కళ్లకు కట్టారు. అనగనగా.. అంటూ కథలు వింటూ నిద్రలోకి జారుకునే కాలం నుంచి స్మార్ట్ఫోన్‍ను పక్కలో పెట్టుకుని పడుకునే కాలంలోకి ప్రవేశించిన మనం మళ్లీ మన మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని ముఖచిత్ర కథనం ద్వారా బాగా వివరించారు. – కె.ఉమాకాంత్,
ఆర్.వెంకటేశ్వరరావు, సి.అప్పలరాజు, కేఆర్ సురేశ్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు (హైదరాబాద్)
అన్వేషణ
భగవంతునిపై నమ్మకం కలగాలంటే స్వీయానుభూతి ఉండాలి తప్ప ఎవరో చెప్పిన అభిప్రాయాల ప్రకారం కాదనే విషయాన్ని డిసెంబరు సంచికలోని ఆధ్యాత్మిక వికాసం శీర్షికలో తెలియచెప్పారు. ఇందులో మనల్ని మనం అన్వేషించుకోవడానికి ఇచ్చిన ప్రశ్నలు బాగున్నాయి.
జి.రమేశ్‍బాబు- విశాఖపట్నం, కనకప్రసాద్- తిరుపతి, బాలాజీ- హైదరాబాద్
బాగున్నాయ్..
ఆరోగ్యభాగ్యం, ఆధ్యాత్మిక కథలు, పలుకుబడి, సామెత కథలు, అనగనగా.. వంటి శీర్షికలు బాగుంటున్నాయి.
– పి.గోపాలకృష్ణ, ఆర్.కృష్ణవేణి, తిరుపతిరావు మరికొందరు (ఈ-మెయిల్)
Review ఉత్తరాయణం.