ఉత్తరాయణం

దాచుకున్నాం..
తెలుగు పత్రిక మార్చి 2023 సంచికలో అందించిన విక్రమార్క భేతాళ కథలు చాలా బాగున్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన కథలు.. మళ్లీ ఆ రోజుల్ని, నాటి జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఈ తరం పిల్లలకు తప్పక తెలియాల్సిన, తప్పక చదవాల్సిన కథలివి. సంచిక మొత్తం 25 కథలు అందించడం ద్వారా లైబ్రరీ కాపీగా భద్రపరుచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
– రావు బాలకృష్ణ, కె.మహేశ్‍, ఆర్‍.లింగేశ్వరరావు, కపిల్‍, పి.రాధాకృష్ణ, రాజారావు, దయాకరరావు మరికొందరు పాఠకులు

వివేకం.. విజ్ఞానం
విక్రమార్క భేతాళ కథల ద్వారా విజ్ఞానాన్ని, వివేకాన్ని తెలుసుకోగలిగాం. ఆయా సందర్భాలలో ఎలా ఆలోచించాలి? తార్కికంగా ఏం చేయాలనే విషయాలను ఈ కథల ద్వారా ఎంతో ఆసక్తికరంగా చెప్పారు. అభినందనలు.
– సీహెచ్‍.రామశర్మ, మల్లీశ్వరి, పాండురంగారావు- విజయవాడ, కే.ఆర్‍.నగేశ్‍, వివేక్‍- హైదరాబాద్‍

ప్రతి సంచిక ప్రత్యేకం
ప్రతి సంచికలోనూ ప్రాచుర్యం కలిగిన కథల ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దాలనే ఆలోచన అభినందనీయం. ఈ కాలం పిల్లలంతా తప్పకుండా చదవాల్సిన కథలివి.
– రవిచంద్ర- తిరుపతి, నవీన్‍- వరంగల్‍

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top