ఆరోగ్య భాగ్యం
తెలుగు పత్రిక జూన్ 2023 సంచికలో ఆరోగ్యభాగ్యం శీర్షిక కింద అందించిన అశ్వగంధ ఆయుర్వేద ఔషధ మొక్క గురించిన వివరాలు బాగున్నాయి. నిజానికి వైద్యం నేటి ఆధునికతను సంతరించుకోక ముందు మన పెరటి మొక్కలే మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవనడానికి అశ్వగంధ ఒక ఉదాహరణ.
– సీ.కే.రామబ్రహ్మం, కవితాప్రసాద్, నాగరాజారావు, మరికొందరు హైదరాబాద్ నుంచి
విష్ణు నామాలు
తెలుగు పత్రిక జూన్ 2023 సంచికలో విష్ణు సహస్ర నామాల్లోని కొన్ని నామాల గురించి, వాటి అర్థతాత్పర్యాల గురించి క్లుప్తంగా వివరించారు. ఇలాగే మొత్తం విష్ణు సహస్ర నామాల గురించి ప్రతి నెలా అందివ్వగలరు.
– ఆర్.గౌతమి- విజయవాడ, రాజశేఖర్- వరంగల్
బ్రహ్మ ఆలయం
బ్రహ్మదేవుడికి ఆలయాలే తక్కువ అనుకుంటే.. అదీ చతుర్ముఖ బ్రహ్మ ఆలయం మన తెలుగు నేలపైనే ఉందని తెలిసి ఆశ్చర్యం వేసింది. చేబ్రోలులోని ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ గావించాల్సిన అవసరం ఉంది.
-రామ్.టి., అట్లాంటా
నీతి కథలు
భారతంలో నీతి కథలు పేరిట అందిస్తున్న ఇతిహాస కథలు చాలా బాగుంటున్నాయి.
– మాధురి, విజయవాడ
Review ఉత్తరాయణం.