ఉత్తరాయణం

జీవిత ధన్యత
తెలుగు పత్రిక ఆగస్టు 2023 సంచికలో ముఖచిత్రం కింద అందించిన ‘సిరి దేవత’ కథనం డిఫరెంట్‍గా ఉంది. లక్ష్మీదేవి గురించి మంచి విషయాలు తెలియపరిచారు.
అలాగే, జీవితానికి ధన్యత కలిగించేది సంపద కాదు.. ఆధ్యాత్మిక సాధన అనే విషయాన్ని భక్త తుకారాం కథ ద్వారా చాలా గొప్పగా, స్పష్టంగా, సరళంగా చెప్పారు.

– ఎన్‍.బాలచంద్ర, రాజశేఖర్‍, రాజేశ్‍, ఈశ్వరప్రసాద్‍, కె.రామచందర్‍రావు హైదరాబాద్‍, ఉమాశంకరప్రసాద్‍, రాజ్యలక్ష్మి, సురేశ్‍ మరికొందరు పాఠకులు

భారత కథలు
భారతంలో నీతి కథలు పిల్లలనే కాదు.. పెద్దలనూ అందరినీ చదివిస్తున్నాయి. ఇవి చాలా సరళంగా ఉంటున్నాయి. ఇలాంటి నీతి కథలను మరిన్ని మన తెలుగు పత్రిక ద్వారా పరిచయం చేయగలరని ప్రార్థన.
– పి.మనోహర్‍, తిరుపతి

వంటలు
మన ఆహారం శీర్షికన పురాతన వంటకాల గురించి వివరించడం బాగుంది. అలాగే, వాటిలోని పోషకాలు, వాటిని తినడం వలన కలిగే ఆరోగ్య రహస్యాల గురించి బాగా వివరిస్తున్నారు.
– రామ్‍.కె., అట్లాంటా

మంత్రపుష్పం
ఆగస్టు సంచికలో మంత్రపుష్పం శీర్షికన లక్ష్మీదేవి ముఖ్య నామాల గురించి విశ్లేషించడం బాగుంది.
– కావేరి, విజయవాడ

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top