కార్తీక దీపశోభ
తెలుగు పత్రిక నవంబర్ 2023 సంచికలో కార్తీక శోభ ఉట్టిపడింది. ఆ మాస విశేషాలను తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చదివించింది. కార్తీకంలో హరిహరుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కార్తీక మాస విధులు, వ్రత కథలతో అందించిన ఈ కథనం బాగుంది.
– పి.సంతోష్‍కుమార్, అనన్య, కవిత, రేవతి, సుధాకరరావు, వెంకటరమణ, ఆన్‍లైన్ పాఠకులు
నీతి కథలు
వరుసగా ప్రతి సంచికలో అందిస్తున్న నీతి కథలు చదివిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని నీతి కథలను సులభంగా, సరళంగా అర్థమయ్యేలా అందిస్తున్నందుకు అభినందనలు.
– కే.ఆర్.రమేశ్, నారాయణ, వాసు, వై.ప్రతిమాశంకర్, కె.అన్నపూర్ణ, రవిచంద్ర- హైదరాబాద్/విశాఖపట్నం
నచ్చిన పుస్తకాలు
నవంబరు 2023 తెలుగుపత్రికలో సినిమా శీర్షిక కింద హీరోయిన్ రష్మికకు నచ్చిన పుస్తకాల గురించి ఇవ్వడం బాగుంది. నటీనటుల ఇలాంటి వ్యక్తిగత అభిరుచులు ఇతరులకు కూడా ఆసక్తి కలిగిస్తాయి.
– రామచంద్ర, విజయవాడ
పురాణ పాత్రలు
తెలుగు పత్రికలో వరుసగా అందిస్తున్న పురాణ పాత్రలు, వాటి నేపథ్యాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.
– పి.వెంకట్, తిరుపతి
Review ఉత్తరాయణం.