నవ్వుదాం!
‘నవ్వు లిపి లేని భాష. ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా ఎవరితోనైనా మాట్లాడగలిగే భాష కానీ భాష నవ్వు ఒక్కటే. అది నిశ్శబ్దాన్ని ఛేదించే శబ్దం. దానికి ప్రాంతీయ భాషా భేదాలు, జాతిమత విభేదాలు ఏమీ లేవు’ అంటూ తెలుగు పత్రిక మే సంచికలో అందించిన ముఖచిత్ర కథనం నవ్విస్తూనే ఆలోచింప చేసింది. ఈ రోజుల్లో నవ్వు మరీ అరుదైపోయింది.
– పి.నరసింహారావు, కె.సంతోష్, రమేశ్‍కుమార్, తోట రామకృష్ణ, టి.సుధీర్, అరవింద, మోహన్, కవిత మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
శబ్ద కాలుష్యం
శబ్ద కాలుష్యం మనకు తెలియకుండానే ఆరోగ్యానికి ఎంత చేటు తెస్తుందో మే నెల తెలుగుపత్రిక సంచికలో ఆరోగ్య భాగ్యం శీర్షిక కింద వివరించిన తీరు బాగుంది. శబ్ద కాలుష్యంపై అందరికీ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.
– లావణ్య, ఎ.నాగేశ్వరరావు, వెంకటేశ్, ఆర్.మురళీకృష్ణ, బిక్షపతి, బి.కృష్ణకుమార్
‘ఆహా’..రం
వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏవి తినాలి? ఏవి తినకూడదు? అలాగే ఏవి తాగాలి? ఏవి తాగకూడదో మే నెల సంచికలో అందించిన వివరాలు ఎంతో ఉపయోగకరం. ఆరోగ్యభాగ్యం శీర్షిక కింద మంచి విషయాలు తెలియపరుస్తూ అవగాహన కలిగిస్తున్నారు.
– బీఆర్ రాజు, హైదరాబాద్
Review ఉత్తరాయణం.