
నాన్న భరోసా
తెలుగు పత్రిక జూన్ సంచికలో అందించిన ఫాదర్స్ డే ముఖచిత్ర కథనం బాగుంది. ఎందుకో నాన్న జీవితం నిండా త్యాగాలమయం అయినా ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం దక్కదు. ఈ క్రమంలో నాన్న గొప్పదనాన్ని తెలుపుతూ అందించిన ప్రధాన కథనం చదివించింది. ఎవరి జీవితంలోనైనా తొలి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవం. నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి.నాన్న భుజం లోకాన్ని చూపించే బడి. అమ్మ జోలపాట.. నాన్న నీతి పాఠం.. అంటూ సాగిన కథనం ఆసాంతం చదివించింది. – కె.కృష్ణకాంత్, బి.శ్రీనివాస్, మురళీధర్‍రావు, ఆర్.ఆర్.రవిచంద్ర, నిఖిల్, టి.సుందరరావు, పి.నవీన, కేఆర్ సుదర్శన్, పి.అనిత మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
ఆరోగ్య ‘యోగం’
నేటి జీవనశైలిలో యోగా ప్రాధాన్యాన్ని తెలుపుతూ యోగా దినోత్సవం సందర్భంగా అందించిన కథనం వండర్‍ఫుల్. మరిన్ని పేజీల్లో ఆసనాల గురించి విపులంగా, వివరంగా ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది.
– రాధాకృష్ణ-తిరుపతి, వి.మనోహర్- హైదరాబాద్, మరికొందరు పాఠకులు
అవగాహన
గుండె ఆరోగ్యంపై అందించిన ‘ఆరోగ్యం బా‘గుండె’నా!’ స్టోరీ గుండెజబ్బులపై ఎంతో అవగాహన కలిగించింది.
– టి.బాలచంద్ర, విజయవాడ
Review ఉత్తరాయణం.