కొత్త ప్రభుత్వాలు
తెలుగు పత్రిక 2024, జూలై సంచికలో అందించిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు ఆంధప్రదేశ్‍లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంపై, ఆయా పార్టీల విజయాలపై మంచి వివరాలు అందించారు.
– పి.రామకృష్ణారావు, సీహెచ్.వెంకటేశ్, కానూరు రవికాంత్, చందప్రకాశ్, యజ్ఞశ్రీ, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
నివాళి
‘ఈనాడు’ వ్యవస్థాపకుడు రామోజీరావు కన్నుమూసిన సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో అందించిన ప్రధాన కథనం చాలా బాగుంది. ఆయన ఏయే రంగాల్లో ఎలా విజయం సాధించారో, ఆయన మంచి మాటలు అందరికీ వ్యక్తిత్వ వికాసం పాఠం వంటివి.
– టి.రవిచంద్ర, కె.వినీల్, ఆర్.విజయకృష్ణప్రసాద్, టి.భానుప్రకాశ్‍రెడ్డి, కె.వెంకటకృష్ణారావు మరికొందరు పాఠకులు
బాగున్నాయి..
సామెతలు, జాతీయాలు, పిల్లల పాటలు, పురాణ పాత్రలు, రుషుల చరిత్ర, ఆధ్యాత్మిక వికాసం, మాసం-విశేషం వంటి శీర్షికలు చాలా బాగుంటున్నాయి. వీటిని చదవడం ద్వారా ఎన్నో విషయాలు, విశేషాలు తెలుసుకోగలుగుతున్నాం.
– ఎ.బాలకృష్ణ-నర్సాపురం, పి.వినోద్- హైదరాబాద్, సీహెచ్.సునీల్- తిరుపతి, గోవిందరావు- విశాఖపట్నం
Review ఉత్తరాయణం.