నీ స్నేహం..
తెలుగు పత్రిక 2024, ఆగస్టు సంచికలో స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం బాగుంది. ‘పండంటి స్నేహానికి పన్నెండు మంది స్నేహితులు’ అంటూ 12 రకాల ఫ్రెండ్స్ గురించి, వారితో స్నేహం చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి బాగా విశ్లేషించారు. అలాగే, పురాణాలు, ఇతిహాసాల్లో ప్రసిద్ధి చెందిన స్నేహాల గురించి కూడా వివరాలు అందించి ఉండాల్సింది.
– పి.వెంకట్-వరంగల్, కార్తీక్-హైదరాబాద్, రవికుమార్, చంద్రశేఖర్, టి.నాగరాజు, సురేశ్‍కుమార్, టి.చంద్ర, వినీత్‍కృష్ణ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
టాటూలు
ప్రస్తుతం టాటూల ట్రెండ్ నడుస్తోంది. సినీ పరిశ్రమలోని కథానాయికల టాటూల గురించి, వాటి వెనుక ఉన్న నేపథ్యాల గురించి సినిమా పేజీలో ఇచ్చిన వివరాలు బాగున్నాయి.
– ఆర్.పల్లవి, హైదరాబాద్, వినోద్‍కుమార్- తిరుపతి, రుషీకేశ్ (ఈ-మెయిల్)
విశేషం
‘మాసం – విశేషం’ శీర్షిక కింద ఆ నెలలో వచ్చే పండుగల గురించి వివరించడం బాగుంది. ముఖ్యంగా ఆగస్టు సంచికలో అందించిన ముఖ్య పండుగల వివరాలు ఆసక్తికరంగా చదివించాయి.
– కె.బాలాకుమార్, మృణాళిని మరికొందరు
ఆన్‍లైన్ పాఠకు
Review ఉత్తరాయణం.