
కథా పారవశ్యం
తెలుగు పత్రిక 2024, నవంబరు సంచికలో ‘పరవశింపచేసే కథలు.. పరమేశ్వరుని గాథలు’ శీర్షికన అందించిన విశేషాలు చదివించాయి. ఇంతకుముందు ఎప్పుడూ చదవని అంశాలను చదివి తెలుసుకున్నాం.
– టీఎస్ రవిచంద్ర, ఆర్.రమేశ్, కె.శ్రీనివాస్, పరిమళ, వినోద్‍కుమార్, పి.రవి మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
పూజావళి
కార్తిక మాసంలో నెల రోజుల పాటు చేయాల్సిన పూజా విధుల గురించి అందించిన సమాచారం బాగుంది. ఏ రోజు ఎవరిని, ఎలా, ఏ మంత్రంతో పూజించాలి? ఏయే ఆహారం తీసుకోవాలనే వివరాలు చదివి భద్రపరుచుకున్నాం. ఇలాంటి విశేషాలు మరిన్ని అందించాలని కోరుతున్నాం.
– ఎ.రామకృష్ణారావు (తిరుపతి), ఆర్.కృష్ణయ్య (హైదరాబాద్), పి.వెంకటేశ్ (విజయవాడ), రాజేశ్వరరావు (వరంగల్)
శివతాండవం
శివ తాండవ విశేషాలు ఎంతగానో చదివించాయి. చిదంబర నటరాజ స్వామి నృత్య విన్యాసంలో దాగి ఉన్న సృష్టి రహస్యం గురించి, దాని వెనుక గల శాస్త్రీయ కోణం గురించి అందించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. జెనీవాలోని శాస్త్ర పరిశోధన కేంద్రంలో నటరాజ స్వామి విగ్రహం ఉండటం ఆశ్చర్యకరం.
– ఆర్.రాజు (విశాఖపట్నం)
Review ఉత్తరాయణం.