
పండగ సందర్భం
‘పండగంటే పిండివంటలు చేసుకుని, కొత్తబట్టలు వేసుకునే సంబరం కాదు.. నిన్నూ నన్నూ ఏకం చేసే ఒక సందర్భం..’ అంటూ తెలుగు పత్రిక 2025, జనవరి సంచికలో సంక్రాంతిని పురస్కరించుకుని అందించిన ముఖచిత్ర కథనం భలే ఉంది. పండగలు నేడు పరమ రొటీన్‍గా మారిపోయాయి. వాటిని అందంగా, ఆనందంగా ఎలా మలుచుకోవాలో చక్కగా వివరించారు.
– సి.కృష్ణకాంత్‍రెడ్డి, పి.విశ్వనాథరావు, టి.ఎస్.రవి, కడెం రామచంద్ర, పి.భార్గవి, ఎల్.ఆర్.రుషి మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
పిల్లల పాటలు
మనం మరిచిపోయిన పిల్లల పాటలను మళ్లీ గుర్తు చేస్తున్నారు. ఈ కాలం పిల్లలకు తెలియన పాత పాటలను అందించడం చాలా అర్ధవంతమైన విషయం. పిల్లల పేర్లు కూడా చాలా ఆధునికంగా ఉంటున్నాయి. ఇలాంటివే మరిన్ని శీర్షికలు పిల్లల కోసం ప్రవేశపెట్టండి.
– రాజేశ్వరరావు, తిరునగరి వాసు, సీహెచ్.వెంకటేశ్
వస్తు గుణాలు
తెలుగు పత్రికలో అందిస్తున్న వస్తుగుణ దీపిక శీర్షిక చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయా పదార్థాల లక్షణాలను తెలుపుతూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను క్లుప్తంగా తెలపడం బాగుంది. అలాగే పురాతన వంటకాలనూ పరిచయం చేయండి.
– ఆర్.దీపిక, రామ్ టీ.ఎస్., (ఈ-మెయిల్ ద్వారా)
Review ఉత్తరాయణం.