
శివ వైభవం
శివుడి గురించి ఇప్పటి వరకు అవీ ఇవీ విన్నవే కానీ.. ఆయనకు దశావతారాలు ఉన్నాయని, ఆయన నర్తించిన క్షేత్రాలు ఐదు ఉన్నాయని ఇదే తెలుసుకోవడం. తెలుగు పత్రిక 2025, ఫిబ్రవరి సంచికలో మహా శివరాత్రి సందర్భంగా శివ వైభవాన్ని భలే వివరించారు. అలాగే శ్రీశైలం క్షేత్రం గురించి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలిగాం.
– సీహెచ్.శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, రచన, కమలేశ్, డి.వీ.కృష్ణ, రవివర్మ, కే.ఆర్.సత్యప్రసాద్, కె.రఘురామ్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మహమ్మారిపై..
వ్యాధి కంటే అవగాహన రాహిత్యం మనిషిని మరింత ముందుగానే చంపేస్తుందంటూ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యభాగ్యం శీర్షికన అందించిన అవగాహన కథనం చాలా బాగుంది. ఏ వ్యాధి అయినా ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలుసుకుంటే దాని బారినపడకుండా ఉండగలమని బాగా వివరించారు.
– కె.వేణుగోపాల్, హైదరాబాద్
క్లుప్తంగానైనా..
తెలుగు పత్రికలో ఫిబ్రవరి సంచిక సంపాదకీయంలో శివరాత్రి, భీష్మ ఏకాదశి, శ్రీపంచమి, రథ సప్తమి పర్వాలను వర్ణిస్తూ అందించిన వివరాలు క్లుప్తంగా ఉన్నా.. చదివించాయి.
– ఆర్.సీ.రవిచందర్, తిరుపతి
Review ఉత్తరాయణం.