102 నాటౌట్
ఆనందాన్నిచ్చే పనిచేయాలి.. తృప్తి కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి.. శరీరానికి సౌఖ్యాన్నిచ్చే వ్యాయామాన్ని చేయాలి.. జీవితంలో ఈ మూడు పనులు చేస్తే చాలు వందేళ్లు బిందాస్‍గా బతికేయొచ్చనే కాన్సెప్ట్తో ఏప్రిల్ 2025 తెలుగుపత్రికలో అందించిన ఆరోగ్యభాగ్యం శీర్షిక చాలా బాగుంది. ఈ మూడు అంశాలను చక్కగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వివరించిన తీరు బాగుంది.
– పి.చిన్నికృష్ణ- విశాఖపట్నం, ఆర్.శివప్రసాద్, కె.కవిత, సి.శశిధర్‍రావు, వక్కంతం బలరామ్, రాజారవిప్రకాశ్ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
రామ పట్టాభిషేకం
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయ ప్రాశస్త్యం గురించి ఆధ్యాత్మిక వికాసం శీర్షిక కింద అందించిన వివరాలు బాగున్నాయి. ముఖ్యంగా శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. అలాగే, ఈ ఆలయానికి సంబంధించి ఇంతకుముందు తెలియని వివరాలెన్నో తెలుసుకోగలిగాం.
– టి.శివప్రసాద్-హైదరాబాద్,
ఎస్.శ్రీకాంత్‍రావు- తిరుపతి, వినోభారావు- కరీంనగం
సీతారాముల ప్రేమ
తెలుగు పత్రిక ఏప్రిల్ సంచికలో సీతారాముల కల్యాణ ఘట్టాన్ని, వారి మధ్య గల అన్యోన్యమైన ప్రేమబంధాన్ని వాల్మీకి వివరించిన తీరుతో అందించిన వివరాలు చదివించాయి. – రవి, హైదరాబాద్









































































Review ఉత్తరాయణం.