రావమ్మా మహాలక్ష్మి..
వరలక్ష్మీ వ్రత నేపథ్యంలో అందుబాటులో ఉన్న లక్ష్మీ సాధనాల గురించి అందించిన ‘రావమ్మా మహాలక్ష్మి మా ఇంటికి’ కథనం బాగుంది. పూజగదిని వరలక్ష్మీ వ్రత వేళ అందంగా ఎలా అలంకరించుకోవాలో, పూజాలంకరణ వస్తువులు ఏవేమి అందుబాటులో ఉన్నాయో బాగా వివరించారు.
– ఆర్.సారధి, పి.వరప్రసాద్- విశాఖపట్నం, కేఆర్‍కే చలపతిరావు- హైదరాబాద్, కనిగిరి వెంకట్రావు, కె.సీత మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
వ్రత విధి
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆగస్టు తెలుగు పత్రిక సంచికలో అందించిన వ్రత విధానం వివరాలు బాగున్నాయి. వ్రతానికి ఏమేం కావాలో, వాటిని ముందే ఎలా సిద్ధం చేసుకోవాలో బాగా వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీ స్తోత్రాలను కూడా మరిన్ని అందించి ఉంటే బాగుండేదని అనిపించింది.
– ఎస్.రవికాంత్, టీఎస్‍ఆర్ రవికుమార్-హైదరాబాద్
పురాణ పాత్రలు
తెలుగు పత్రిక ఆగస్టు సంచికలో మంథర గురించి అందించిన వివరాలు బాగున్నాయి. అసూయకు మారుపేరైన ఆమె రాముడికి చేసిన ద్రోహం, తదనంతర పరిణామాలు చదివించాయి. మనిషి ఎలా ఉండకూడదో ఆమె స్వభావాన్ని చదివి తెలుసుకోవాలి.
– విష్ణు హైదరాబాద్









































































Review ఉత్తరాయణం.