పిల్లల చదువులు
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పత్రిక నవంబరు సంచికలో అందించిన ప్రత్యేక కథనం బాగుంది. అక్కడి విద్యా విధానం చాలా బాగుంది. పిల్లలను స్కూలుకు పంపే తల్లిదండ్రులు, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, వ్యవస్థను నడిపిస్తున్న ప్రభుత్వాలు నిజంగా ఇలాంటి విద్యా విధానాల గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వాలు అలాంటి విధానాలను అమలు చేయాలి. అలాంటి అత్యుత్తమమైన, అద్భుతమైన విద్యావ్యవస్థను రూపొందించాలి.
– పి.రవిశంకర్, సీహెచ్.అమర్‍నాథ్, టి.బిక్షపతి, ఆర్.కవిత, తాండూరు రమేశ్ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
పిల్లల ఆరోగ్యం
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆరోగ్య భాగ్యం శీర్షిక కింద పిల్లల ఆరోగ్యం గురించి అందించిన వివరాలు చదివించాయి. ఇలాగే ప్రతి సంచికలో పిల్లల చదువులు, వికాసం, ఆరోగ్యాలకు సంబంధించిన రెగ్యులర్‍గా ఏవైనా శీర్షికలు అందించండి.
– కె.కిశోర్, హైదరాబాద్
మానసిక స్వస్తత
నవంబరు సంచికలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, అదెలా దెబ్బతింటుందో, దానికంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలో వివరించిన తీరు బాగుంది. వైద్యుల సలహా సూచనలు కూడా ఇవ్వండి.
– పి.రాజేశ్, తిరుపతి









































































Review ఉత్తరాయణం.