ఉత్తరాయణం

శావణ మాస విశేషాలు
శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, వ్రత విశేషాలతో వచ్చిన ఆగస్టు మాసపు ‘తెలుగు పత్రిక’ ఎంతగానో అలరించింది. నేడు వస్తున్న పత్రికలలో మన తెలుగు సంస్క•తీ సంప్రదాయాల గురించి ఇంత విపులంగా వివరణలు, విశ్లేషణలతో వస్తున్న పత్రిక మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి పత్రికను పదిలంగా భద్రపరుచుకోవాలన్నంతగా విషయం ఉంటోంది. ఇంకా మన సంప్రదాయాలు, ఆచారాల గురించి తగినంతగా సమాచారం అందిం చండి. ఇది భావితరాల వారికి ఎంతగానో ఉప యోగపడుతుంది. అలాగే, సందేహాలకు సంబంధించి నిపుణులైన వారితో ఏదైనా కాలమ్‍ ప్రవేశపెడితే బాగుంటుందనేది మా అభిప్రాయం
– భాస్కర్‍, పురంధర్‍, రామస్వామి, అరవిందకుమార్‍- విజయవాడ, ఆర్‍.రామ్‍, రఘు, కీర్తన- హైదరాబాద్‍, పి.రామసంజీవ్‍, మనోహర్‍, ప్రేమ్‍కుమార్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

జాతీయాలు బాగున్నాయ్‍..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ప్రతి సంచికలో అందిస్తున్న జాతీయాలు, సామెతలు బాగుంటున్నాయి. ఇవి మనమెప్పుడో మరిచిపోయిన విషయాలను తెలియ చెబుతున్నాయి. చిన్న సామెతల్లో, మాటల్లో ఎంత అర్థం ఉందో వివరిస్తున్న తీరు బాగుంది. ముఖ్యంగా జాతీయాలు ఎలా స్థిరపడ్డాయో తెలిసివస్తుంది. అలాగే, చిన్న చిన్న సామెతల్లో ఎంత పెద్ద అర్థం ఇమిడి ఉందో చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకా తెలుగు భాషకు సంబంధించి మరింత కృషి చేసి మరిన్ని మంచి విషయాలను అందించడానికి ప్రయత్నించండి.
– వి.వేద, కనకారెడ్డి, శ్రావణ్‍కుమార్‍, వెంకటేశ్‍, పి.రాధిక, శైలజ, మీనాకుమారి, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

ఆధ్యాత్మిక సంపద
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రికలో అందిస్తున్న ఆధ్యాత్మిక వికాసం, పిల్లల కథలు, ఆటపాటలు అలరిస్తున్నాయి. అలాగే ఆరోగ్య సంబంధ విషయాలు చదివిస్తున్నాయి. అటు ఆధ్యాత్మికత, ఇటు వ్యక్తిత్వవికాసం, మరోపక్క ఆరోగ్యం గురించి విలువైన సమాచారం అందిస్తున్నారు. ముఖ్యంగా ఆయా మాసాలలో వచ్చే ముఖ్య పండుగలు, పర్వదినాల గురించి, వాటి వెనుక గల నేపథ్యం, ఆయా రోజుల్లో పాటించాల్సిన ఆచార వ్యవహారాల గురించి చక్కగా వివరిస్తున్నారు. ‘మాసం – విశేషం’ శీర్షిక ద్వారా ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాం.
– సీహెచ్‍.సత్యనారాయణ, మధు, పి.రాజగోపాల్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు, వంశీ.పీ.ఆర్‍.- అట్లాంటా

రుచులు బాగుంటున్నాయి..
‘సూపర్‍డిష్‍’ శీర్షిక కింద అందిస్తున్న ఆధునిక వంటల గురించి ‘తెలుగు పత్రిక’లో అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. అయితే ఎక్కువగా బ్రేక్‍ఫాస్ట్గా, చిరుతిళ్లుగా చేసుకునే వాటి గురించే ఇస్తున్నారు. రెగ్యులర్‍ వంటకాల గురించి కూడా సమాచారం, తయారీ విధానం గురించి తెలియ చేయండి. ఇంకా ఇతర శీర్షికలు, కాలమ్స్ చదివిస్తున్నాయి.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top