ఉత్తరాయణం

చందనోత్సవం

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ (వరాహ), చతుర్థ (నరసింహ) అవతారాల సమ్మిళితమై, వైవిధ్యభరితమైన రూపంలో సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారికి ఏటా వైశాఖ మాసంలో జరిగే చందనోత్సవం గురించి ఎంతో వివరంగా ఎన్నో వివేషాలతో అందించిన ముఖచిత్ర కథనం బాగుంది. ఇంతకుముందు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాం.
-ఆర్‍.నారాయణ, సీహెచ్‍.రవిప్రకాశ్‍, రాధాకృష్ణ, భాస్కరరావు, పి.చంద్రశేఖర్‍, కె.చరిత, పి.వైష్ణవి, రాజశేఖరరావు, కనిగిరి బాపూరావు మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

పురాణపాతల్రు

తెలుగుపత్రిక ఏప్రిల్‍ సంచికలో అందించిన పురాణపాత్రలు, మన మహర్షులు శీర్షికలు బాగున్నాయి. ధ్రువుడు, హరీత మహర్షుల విశేషాలు చదివించాయి. ధ్రువుడికి సంబంధించిన వివరాలు మరింత విపులంగా ఇచ్చి ఉండాల్సిందని అనిపించింది.
-బి.వెంకటేశ్వరరావు,గౌతమి, పి.నరహరి, మనోహర్‍

సత్యదేవుని పెళ్లి

ఏప్రిల్‍ సంచికలో తిథి ప్రత్యేకం శీర్షికన ఆంధప్రదేశ్‍లోని అన్నవరంలో కొలువైన సత్యనారా యణ స్వామి కల్యాణోత్సవం, ఆ క్షేత్రం గురించి అందించిన విశేషాలు చదివించాయి.
– వెంకటరావు, హైదరాబాద్‍

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top