తెలుగు వికాసం
విదేశాల్లో ఉన్న తెలుగు వారి కోసం తెలుగు పత్రిక వివిధ శీర్షికల ద్వారా చేస్తున్న ప్రయత్నం బాగుంది. విదేశాల్లో ఉన్న వారిలో తెలుగు వికాసానికి ఆయా శీర్షికలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను విపులంగా అందిస్తున్నారు. ఇది అందరూ చదవదగిన పత్రిక. మరిన్ని, మరింత విలువైన సమాచారాన్ని అందిస్తూ అందరి మనసులు చూరగొనాలని కోరుకుంటున్నాం.
-రవికిరణ్, కిషోర్, రాంప్రసాద్- హైదరాబాద్, రామ్.కె., చరణ్, జ్యోతి.పి.
మరికొందరు ఆన్లైన్ పాఠకులు
సూపర్ టేస్ట్
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ఏప్రిల్ సంచికలో అందించిన వివరాలు బాగున్నాయి. పండుగల గురించి, పర్వదినాల గురించి, వాటి నేపథ్యం, తిథి, నక్షత్రాల యుక్తంగా అందిస్తున్న విశేషాలు చదివిస్తు న్నాయి. నిజానికి ఇవన్నీ మనం జరుపుకునే పండుగలు, పర్వదినాలే అయినా, వీటి గురించి పూర్తిగా తెలియదు. అటువంటి విషయాలు తెలియ చెప్పడం బాగుంది. ఈ రోజుల్లో ఇంతటి విలువైన సమాచారంతో వస్తున్న ఏకైక పత్రిక తెలుగుపత్రికే అని చెప్ప వచ్చు. ఈ ఒరవడిని ఇలాగే కొన సాగించండి.
– సీహెచ్.శ్రీనివాస్- హైదరాబాద్, శరత్‍చంద్ర- నెల్లూరు, రాజీవ్.పి, సందీప్‍రెడ్డి, జ్యోతిర్మయి.పి., అశోక్ చక్రవర్తి, వెంకటేశ్వరరావు, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
కార్టూన్లు ఇవ్వండి
తెలుగు పత్రిక ద్వారా అందిస్తున్న సమాచారం ఓకే. బాగుంటుంది. కానీ, సరదాగా కాసేపు నవ్వించే, మనసుకు ఆహ్లాదం కలిగించే కార్టూన్లు, జోక్‍లు కూడా ఇస్తే బాగుంటుందేమో పరిశీలించండి. నేటి యాంత్రిక జీవనంలో మనిషి.
Review ఉత్తరాయణం.