గోవిందా…
తెలుగు పత్రిక డిసెంబర్ సంచికలో అందించిన భజగోవిందం తెలుగు తాత్పర్య సహిత ముఖచిత్ర కథనం చాలా బాగుంది. భజ గోవిందం శ్లోకాలలో ఇమిడి ఉన్న జీవిత పరమార్థం గురించి చదివితే ఆశ్చర్యం అనిపించింది. ఇవి కేవలం శ్లోకాలే అనుకున్నాం కానీ, వాటిలో దాగి ఉన్న అంతరార్థం గురించి చదివితే ఎంతో చక్కని అనుభూతి కలిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వంటి వారు ఇటువంటి శ్లోకరాజాలతో మన భారతీయ సంప్రదాయాన్ని, జీవిత పరమార్థాన్ని గురించి అత్యద్భుతంగా నాడే చెప్పడం విశేషం. మన సంప్రదాయాలు ఎంత పురాతనమైనవో అర్థమైంది
– కె.సత్యబాబు, ఆర్.కిశోర్, రాజబాబు, రవికుమార్, జి.ఆంజనేయులు, మరికొందరు ఆన్‍లైన్ పాఠకు
సామెతలు
సామెతల వెనుక దాగి ఉన్న అంతరార్థాలను విశ్లేషిస్తున్న తీరు బాగుంది. మరుగైపోయిన సామెతలను నేటి తరానికి పరిచయం చేస్తున్నందుకు అభినందన
– బీ.ఆర్.రాంప్రసాద్- హైదరాబాద్, కమల్, శ్రీకాంత్- తిరుపతి
తిథి సహితం..
ఆయా పండుగలను తిథి, వార, తేదీ సహితంగా అందిస్తున్న మాసం విశేషం శీర్షిక తెలుగు పత్రిక మొత్తానికే హైలైట్.
– కమలకుమారి, తిరుపతి
Review ఉత్తరాయణ.