సామెతల వెనుక ఇంత కథా?
నిత్య జీవితంలో మనం ఎన్నో సామెతలను, పద ప్రయోగాలను వాడేస్తుంటాం. ఏదో ఆ సందర్భానికి వాటిని వాడేయడమే కానీ, నిజంగా వాటి వెనుక ఎంత విషయం ఉంది? అవెలా పుట్టాయి? అనే వివరాలు తెలుసుకుంటుంటే భలే ఆసక్తిగా అనిపిస్తోంది. ప్రతి నెలా ‘తెలుగు పత్రిక’లో అందిస్తున్న ‘సామెత కథ’ చాలా చాలా బాగుంటోంది. ఇటువంటి ఆసక్తికరమైన అంశాలను, విషయాలను మరిన్ని అందించాలని కోరుకుంటూ.. తెలుగు పత్రికకు శుభాభినందనలు.
– కె.వినోద, టెక్సాస్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఎన్నో విషయాలు.. విశేషాలు
‘తెలుగు పత్రిక’ సమస్త విషయాలు, సమగ్ర శీర్షికలతో వెలువడుతోంది. విదేశాలలో ఇంత సమాచారంతో వస్తున్న తెలుగు భాషా పత్రిక మరొకటి లేదని సగర్వంగా చెప్పవచ్చు. మన పండుగలు, తిథి విశేషాలు, ఆ నెలలో వచ్చే ముఖ్య పర్వాల గురించి వివరణ చాలా బాగుంది. మరిన్ని శీర్షికలు ఇటువంటివి ప్రవేశపెట్టండి.
– సి.మురహరి, ఆన్‍లైన్ పాఠకుడు
పిల్లలకు, పెద్దలకు వినోదం-విజ్ఞానం
‘తెలుగు పత్రిక’లో అటు చిన్నారులకు, ఇటు పెద్దలకు సమపాళ్లలో వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ షడ్రశోపేతమైన తెలుగింటి భోజనాన్ని వడ్డిస్తున్నారు. నిజంగా ఈ పత్రిక చదవడం.. వీనుల విందు. మరుగున పడిపోతున్న మన తెలుగు విశేషాలను వెలుగులోకి తెస్తూ భావితరాలకు విలువైన వారసత్వ సంపదను అందిస్తున్న పత్రిక యాజమాన్యానికి అభినందనలు.
– ఆర్.మహర్షి, ఆన్‍లైన్ పాఠకుడు, అట్లాంటా, యూఎస్‍ఏ
ఒకటా.. రెండా.. అన్నీ విభిన్నమే!
మాసం-విశేషం, చిన్నారి నీతి కథ, బొమ్మల కథ, సామెత కథలు, నానుడి, పలుకుబడి వంటి శీర్షికలు మనం మరిచిపోయిన విషయాలను మళ్లీ గుర్తు చేస్తున్నాయి. ఇటువంటి బాధ్యతను నిర్వర్తించడం నిజంగా కత్తి మీద సామే. పైగా మరెంతో వ్యయ ప్రయాసలతో కూడుకొన్నది. అయినా, అన్నిటికీ భరించి విలువైన సమాచారాన్ని అందిస్తున్న ‘తెలుగు పత్రిక’ను ఆదరించడం, అక్కున చేర్చుకోవడం మన తెలుగు వారి విధి. ఇటువంటి పత్రికలకు పాఠకులుగా మన వంతు బాధ్యతగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది.
– పి.గిరిధర్, రామాంజనేయులు, జి.సావంత్, కృష్ణకిశోర్, సత్యనారాయణ, మరికొంతమంది ఆన్‍లైన్ పాఠకులు.
Review ఉత్తరాయణ.