భలేగా రా‘సినారె’…
కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారి గురించి చాలా మంచి విషయాలు తెలియ చెప్పారు. ‘రాజు మరణిస్తే విగ్రహాలు పెడతారు. కానీ, కవి పరమపదిస్తే అతను జనం నాలుకలపైనే ఉంటాడు’ అనే నానుడి సినారె విషయంలో నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం. ఆయన తెలుగు వారు గర్వించదగిన సాహితీద్రష్ట. అత్యంత జనాదరణ పొందిన ఆయా సినిమా పాటలు.. ఆయన రాసినవే అని తెలిసి ఆశ్చర్యం కలిగింది. అంత గొప్ప గీతాలు ఆయన రాశారని తెలిశాక చెప్పలేని ఆనందం కలిగింది. ఆయన ఎప్పటికీ తెలుగు వారి హృదయాల్లో పదిలంగా ఉంటారు.
– హెచ్.హరిప్రసాద్, హైదరాబాద్, ఆన్‍లైన్ పాఠకుడు, కవిత, రమణ, వెంకటేశ్ మరికొందరు ఎన్‍ఆర్‍ఐలు, యూఎస్‍ఏ
తెలుగు‘ధనం’..
‘తెలుగుపత్రిక’లోని వివిధ శీర్షికలు బాగుంటున్నాయి. మన తెలుగుదనాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇది అందరూ చదవాల్సిన పత్రిక. తెలుగు భాష, సంస్క•తి, సంప్రదాయాలకు సంబంధించిన ఆయా శీర్షికలను ఇలాగే నిరంతరం కొనసాగించండి.
– రితేశ్వర్, ఆన్‍లైన్ పాఠకుడు
పెద్దలనూ చదివిస్తున్నాయి..
పిల్లల కథలు, పిల్లల ఆటపాటలు పెద్దలనూ చదివిస్తున్నాయి. తెలుగు భాష, సంస్క•తి సంప్రదాయాలకు సంబంధించిన శీర్షికలు చాలా బాగుంటున్నాయి. డాక్టర్ సి.నారాయణరెడ్డి గారికి సంబంధించిన విశేషాలు చదివించాయి. ఆయన రాసిన తెలుగు సినిమా పాటలన్నీ తరచూ వినేవే. కానీ, అవి ఆయన రాసినవే అని ఆయన కన్నుమూసిన తరువాతే తెలిసింది.
– వి.వెంకటేశ్వరరావు, టెక్సాస్, యూఎస్‍ఏ
ఆషాఢ విశేషాలు బాగున్నాయి!
‘మాసం-విశేషం’ శీర్షికన అందించిన ఆషాఢ మాస విశేషాలు బాగున్నాయి. ఆయా తిథులను అనుసరించి వచ్చే పండుగలు, పర్వదినాల గురించి ఇవ్వడం మంచి ప్రయత్నం. ఇవి విదేశాల్లో ఉండే తెలుగు వారికి చాలా ఉపయోగకరం. ఆయా తిథి ప్రాశస్త్యాల గురించి మరింత విపులంగా వివరించినా బాగుంటుంది. ఒక నెలలో వచ్చే అన్ని ముఖ్య దినాల గురించి వివరించడం బాగుంది.
– కె.రమణ, సీహెచ్.వెంకట్రామ్, శ్రీరాం మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
వేటికవే ప్రత్యేకం..
ఆధ్యాత్మిక వికాసం, మాసం విశేషం, సామెత కథ, ఆరుద్ర గారి మేటి తెలుగు పదాలు, పలుకుబడి, సంఖ్యాశాస్త్రం.. ఇంకా ఎన్నో శీర్షికలు. అన్నీ వేటికవే ప్రత్యేకం. వీటిని ఇలాగే కొనసాగించండి. విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వారు తప్పక చదవాల్సిన పత్రిక- తెలుగుపత్రిక.
– ఆర్. రాధాకృష్ణ, ఎస్.తిరుపతి, ఎన్‍ఆర్‍ఐలు, యూఎస్‍ఏ.
Review ఉత్తరాయణ.