సం‘క్రాంతులు’..
తెలుగు పత్రికలో జనవరి సంచికలో ఇచ్చిన సంక్రాంతి పండుగ విశేషాలు చదివించాయి. తెలుగు నాట ఏ తిథీ లేకుండా వచ్చే పండుగ ఇదేనన్న విషయం ఈ పత్రికలో చదివిన తరువాతే తెలిసింది. తెలియని విషయాలను తెలియ చెబుతూ మన ప్రాచీన ఆచార సంప్రదాయాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ‘తెలుగు పత్రిక’కు అభినందనలు. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని కావాలి. సంక్రాంతికి సంబంధించిన మొత్తం ఆసాంతం చదివాం. చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఇచ్చిన విశేషాలు బాగున్నాయి. ఇలా ప్రతి నెలా ఏదో ఒక ప్రత్యేక అంశంపై ఎక్కువ సమాచారం అందించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఇటువంటి విశేషాలు, విషయాలు చాలా ఉపయోగపడతాయి.
-ప్రకాశ్.టీఎన్.-ఆస్టిన్, హిరణ్మయి, రాజేశ్, బాలమణి, హిమవంత్,
మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
భాషా, సంస్క•తుల వికాసం..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక జనవరి సంచికలో వివిధ శీర్షికలు బాగున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక వికాసం, ఆధ్యాత్మిక కథ, ఎడిటోరియల్ వ్యాసాలు మానసిక వికాసానికి దోహదం చేసేలా ఉన్నాయి. ఇటువంటి శీర్షికలను మరిన్ని అందించినా బాగుంటాయి. మనసుకు స్వాంతన కలిగించే ఇటువంటి వ్యాసాలు మరిన్ని రావాలి. అలాగే, సంక్రాంతి పండుగ గురించి విశేషాలను ఇచ్చిన తీరు బాగుంది. ఈ మూడు రోజుల పర్వం గురించి ఏ రోజు ఏం చేయాలో వివరంగా అందించారు. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారికి ఇటువంటి వివరాలు ఎంతో ప్రయోజనకరం. ఇటువంటివే మరిన్ని విశేషాలు అందించే ప్రయత్నం చేయండి.
– సుభాన్-హైదరాబాద్, రామకోటేశ్వరరావు- విజయవాడ, కృష్ణప్రసాద్, ప్రణవ్- టెక్సాస్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
సామెతల వెనుక ఇంత కథా?
మన తెలుగుదనానికి చిరునామాకు నిలిచే సామెతలను ఈనాటి తరం వారికి వాటి వెనుక ఉన్న కథలతో సహా తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు. ముఖ్యంగా ఆ సామెత ఎలా పుట్టింది? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? అనేది వివరిస్తున్న తీరు బాగుంది. అలాగే, పలుకుబడి కింద వివిధ పద ప్రయోగాలను ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలియ చెబుతున్న తీరు కూడా బాగుంది. ఇటువంటివన్నీ మంచి ప్రయత్నాలు.
– రాజేందర్- వరంగల్, ఇంద్రాణి, ప్రవీణ్, కేఆర్ ప్రకాశ్, టీ.సందీప్, పి,సుమలత- ఆన్‍లైన్ పాఠకులు
చిరు కథలు..
ఆధ్యాత్మిక కథ, చిన్న పిల్లల కథలు, చిన్నారుల ఆటపాటల శీర్షికలు పెద్దలను కూడా చదివిస్తున్నాయి. ఇవి పేరుకే చిన్నపిల్లల కథలైనా.. పెద్దలు కూడా నేర్చుకోవాల్సిన నీతి ఎంతో వాటిలో దాగి ఉంది. అలాగే ఆధ్యాత్మిక వికాసం, మాసం – విశేషం, పలుకుబడి, సామెత కథ వంటి శీర్షికలు ఎంతో బాగుంటున్నాయి. పండుగ పర్వాలను తిథులతో సహా అందివ్వడం బాగుంది.
– రాంప్రసాద్- విశాఖపట్నం, నరేన్, మధుబాబు- ఆన్‍లైన్ పాఠకులు.
Review ఉత్తరాయణ.