ఉత్తరాయణ

ఉగాది విశేషాలు
తెలుగు పత్రిక మార్చి సంచికలో అందించిన సంవత్సరాది విశేషాలు, ఈ పర్వం వెనుక ఉన్న నేపథ్యం గురించి విపులంగా వివరించారు.
ఉగాది నాడు ఆచరించాల్సిన విధుల గురించి అందించిన విశేషాలు చాలా బాగున్నాయి. నిజంగా ఈ రోజుల్లో ఇంతటి సమాచారం మరే పత్రికలోనూ ఇంత వివరంగా అందుబాటులో లేదంటే అతిశయోక్తి కాదు. ఆయా పండుగలు, పర్వాల గురించి ఇస్తున్న ఇటువంటి సమాచారం అభినందనీయం.
– విశేష్‍.కె.- అట్లాంటా, రేణుక- హైదరాబాద్‍, ప్రసాద్‍కుమార్‍, వి.త్రిపుర, ఎన్‍.వెంకట్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
ఇంత ఉందా?
తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక సంచికలో ఉగాది, శ్రీరామ నవమి గురించి అందించిన వివరాలు అద్భుతం. ముఖ్యంగా ఉగాది పర్వం గురించి ఎంతో సమాచారం అందించారు. మనం నిజానికి ఆయా పండుగలు, పర్వాలను ఏదో జరపాలనుకుంటే జరుపుకుంటాం. అంతేతప్ప వాటి వెనుక ఉన్న నేపథ్యం గురించి కానీ, ఇతర విశేషాల గురించి కానీ మనకు అంతగా తెలియదు. అటువంటి విషయాలను తెలియచెబుతున్న తీరు ఎంతైనా గర్వకారణం. ఉగాది విశేషాలు చదివితే.. ఈ పర్వం వెనుక ఇంత చరిత్ర ఉందా? అనిపించింది.
– – కె.కరుణాకర్‍, పి.రాజశేఖర్‍, రాజేశ్వర్‍, ఎన్‍.నగేశ్‍- హైదరాబాద్‍, వినీల-టెక్సాస్‍, కె.రాంప్రసాద్‍-వరంగల్‍, పి.శివప్రసాద్‍, కె.పవన్‍, సాహితి, శ్రీనివాస్‍.పి., మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
వసంత మాసం..
తెలుగుపత్రిక అంతర్జాతీయ మాసపత్రిక మార్చి సంచికలో వసంత మాసం గురించిన వర్ణన బాగుంది. ఆ మాసం ప్రత్యేకత, పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, తీసుకోవాల్సిన ఆహారం, నిర్వర్తించాల్సిన విధుల గురించి చెప్పిన తీరు బాగుంది.
– టి.వెంకటరెడ్డి- కడప, ఆర్‍.దక్షిణామూర్తి- హైదరాబాద్‍, కపిల్‍, పార్వతి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
వంటావార్పు
నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా ఇంట్లోనే అందుబాటులో ఉండే దినుసులతో ఈజీగా చేసుకోదగిన వంటల గురించి ఇవ్వడం బాగుంది. ఇవి మాకు కొత్త రుచులను అందిస్తున్నాయి. పిల్లల పాటలు, సూక్తులు, పిల్లల కథ, ఆధ్యాత్మిక కథ, ఆధ్యాత్మిక వికాసం, సామెత కథ, పలుకుబడి వంటి శీర్షికలు ఎంతో విలువైనవి. ఈ రోజుల్లో ఇంతటి సమాచారం అందించే పత్రిక మరొకటి లేదనేది నిస్సందేహం.

Review ఉత్తరాయణ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top