ఉత్తరాయణం

ఆరోగ్య ‘జ్యోతి’
అటు ఆరోగ్యాన్ని కలిగిస్తూ.. ఇటు సామాజిక స్ఫూర్తిని రగిలిస్తూ.. సత్యం వైపు నడిపించే అయ్యప్ప స్వామి దీక్షాధారణ గురించి డిసెంబరు తెలుగుపత్రిక సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ముఖ్యంగా యాత్ర సాగే విధానం, అక్కడి విశేషాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది రకాల భావాలకు ప్రతీక అని ఈ ముఖచిత్ర కథనం చదివిన తరువాతే తెలుసుకున్నాం.
– బాలాజీ నాయక్‍, జి.సోమసుందర్‍, కె.పి.కిశోర్‍, లలితకుమారి, రాజేశ్‍, వినయ్‍కుమార్‍, వినోద్‍వర్మ, పీవీఎస్‍ సుందర్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

గీతా పాఠం
గీతా జయంతి సందర్భంగా డిసెంబరు సంచికలో అందించిన ఆధ్యాత్మిక వికాసం శీర్షిక బాగుంది. మనిషిలా సామాన్య జీవితం గడుపుతూనే యోగిలా ఎలా బతకాలో తెలుసుకోవాలంటే ఆత్మవిశ్వాసమనే పాశుపతంతో మనలోని అంత:శత్రువులను తుదముట్టించాల్సిందేనంటూ అందించిన కథనం ఎంతో స్ఫూర్తిని నింపింది. – బాలగోపాల్‍, హైదరాబాద్‍

ఆరోగ్యం
డిసెంబరు సంచికలో ఇంట్లో లభించే దినుసులతోనే ఆరోగ్యాన్ని నయం చేసుకునే చిట్కా విధానాలు చదివించాయి.
– తిరువూరు సురేశ్‍, ప్రసన్న- తిరుపతి

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top