జగదంబ మూల మంత్రార్థం

పంచానికి మూలమైన పరమాత్మను తెలియచేసే శబ్దం- ప్రణవం. అదే ఓంకారం. దీనిలో అ, ఉ, మ, అనే ఆద్యంతాక్షరాలే ‘అమ్మ’గా రూపాం తరం చెందాయి. ‘అ’కారం పలకగానే నోరు తెరుచుకుంటుంది. అది సృష్టిని తెలియచేస్తుంది. ‘మ’కారం పలకగానే నోరు మూసుకుంటుంది. ఇది ఓష్ఠ్యం క్రియ. ఇది సంపూర్ణతను సూచిస్తుంది. ఈ రెండింటి నడుమ ఉన్నదే స్థితి. అందుకే ‘అమ్మ’ సంపూర్ణ శబ్దమైనది. ఓంకారమంత విలువైన, శ్రేష్ఠమైన మంత్రం- ‘అమ్మ’.

బాబా సీమోల్లంఘనం

షిర్డీ సాయిబాబా విజయదశమి (దసరా) నాడే దేహత్యాగం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. 1918వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, అక్టోబరు 15వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సాయిబాబా భౌతిక శరీరాన్ని విడిచారు. పుణ్యతిథి వేళ బాబా భౌతికంగా సమాధి చెందిన లీల, తాను దేహత్యాగం చేయనున్న సంగతిని మహా సమాధి పొందడానికి రెండు సంవత్సరాల

ఆనందాల ఆశ్వయుజం

అక్టోబరు 1, సోమవారం, భాద్రపద బహుళ సప్తమి నుంచి-అక్టోబరు 31, బుధవారం ఆశ్వయుజ బహుళ సప్తమి వరకు విలంబి నామ సంవత్సరం-భాద్రపదం-ఆశ్వయుజం-శరదృతువు-దక్షిణాయన ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం అక్టోబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద - ఆశ్వయుజ మాసాల కలయిక. భాద్రపద మాసంలోని కొన్ని రోజులు, ఆశ్వయుజ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. భాద్రపదంలో వచ్చే పర్వాలలో మహాత్మాగాంధీ జయంతి, మహాలయ అమావాస్య ముఖ్యమైనవి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో

జయ జయహే..

దేవీ నవరాత్రులు..దుర్గాదేవి తొమ్మిది అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజించడానికి ఉద్దేశించినవి. ఆ తొమ్మిది అవతారాలు ఏమిటి? ఆ అవతారాల లక్ష్యం ఏమిటి? ఏయే సందర్భాలలో దేవి ఆ నవావతారాలను దాల్చింది? ఇవన్నీ ఆసక్తికరం. పూజ అంటే దేవీ దేవతల ప్రతిమలను పూజాపీఠంపై ఉంచి పసుపు కుంకుమలతో పూజించడం.. నైవేద్యాన్ని సమర్పించడం.. మనసులోని కోరికలను ఇష్టదైవానికి తెలుపుకోవడం.. ఇది కాదు పూజ పరమార్థం. మనం ఏ దేవతలను పూజిస్తున్నామో ఆ

పసిపాప పరమగురువు

తల్లీ బిడ్డల సహజీవనంలోని ఆధ్యాత్మిక బంధాన్ని అవగాహన చేసుకున్న వారికి ఏ మతగ్రంధమూ పఠించవలసిన అవసరం రాదు. ఏ ప్రవర్త బోధలతోనూ పనిలేదు. బాల్యమనే బంతిపువ్వు, అమాయకత్వపు కొమ్మతో భగవంతుడనే మొక్కను గట్టిగా పట్టుకుని ఉంది. అందుకే పిల్లలూ, దేవుడూ కల్లకపట మెరుగని కరుణామయులని కవులు కొనియాడారు. ఒకవైపు, ఏమీ తెలియని పాప అమాయ కత్వం, మరొక వైపు అన్నీ తెలిసిన అమ్మ జ్ఞానం. ఈ విరుద్ధద్వంద్వాల వింతబంధం అవగాహన చేసుకుంటే

Top