పిల్లలూ.. వాడే ముందు తెలుసుకోండి

తెలుగులో కొన్ని పద ప్రయోగాలు ఎప్పుడు వాడాలో, ఎక్కడ వాడకూడదో చాలామందికి తెలియదు. కానీ, అటువంటి పదాలు నిత్య వాడుకలో వ్యావహారికంలో ఉంటాయి. నిజానికి మన భాష అవసరానికి కొన్ని సంస్క•త పదాలను వాడుతుంటాం. ఆ పదాలను తెలుగులో సమానస్థాయిలో వాడుతున్నప్పుడు ఆ భాషా (సంస్క •తం) నియమాల్ని మాత్రం ఉల్లంఘిస్తున్నాం. వాడుకలో చలామణిలో ఉన్న కొన్ని పదప్రయోగాల గురించి తెలియ చెప్పే ప్రయత్నమిది. నేటి చిన్నారులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి

‘‘ధారావాహికం’’ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి?

తెలుగు వారికి చిరపరిచితమైన ధారా వాహికం పత్రికా సీరియల్‍. టీవీ సీరియల్‍కు కూడా ఈ పదాన్నే వాడుతున్నాం. ‘వాహక’ శబ్దానికి ‘వాహిక’ స్త్రీలింగ రూపం. స్త్రీ లింగరూపాల మీద అమహన్నపుంసకాల మీద చేర్చే ‘ము’ ప్రత్యయం రాదు. కనుక ‘ధారావాహికం’ వ్యాకరణ విరుద్ధం. ధారావాహిక అంటే సరిపోతుంది. ‘ము’ ప్రత్యయం చేర్చి వాడవలచి వస్తే ‘ధారావాహికము’ అనాలి.

‘‘వాదన’’ అనే పదాన్ని ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న విధానం సరైనదేనా?

వాదించడం అనే అర్థంలో బాగా వాడుకలో ఉన్న పదం ఇది. దీని అసలు అర్థం శబ్దం కలిగించడమే. ఉదాహరణకు వీణావాద, మృదంగ వాదన.. ఇలాగన్న మాట. వాదించాలి అనే అర్థం రావాలంటే ‘వాదం’ అని మాత్రమే వాడాలి. కానీ, నేడు కోర్టు కేసులు, ఇతర వార్తలకు సంబంధించి పత్రికల్లోనూ, ఇతరత్రా వాడుకలో కూడా ‘వాదన’ అనే పద ప్రయోగమే ఎక్కువగా వినిపిస్తోంది, కనిపిస్తోంది.

‘‘అహోరాత్రుళ్లు’’ మన తెలుగు పదమేనా? దీని వాడుక ఎలా ఉండాలి?

రాత్రింబవళ్లు అని పై పదానికి అర్థం. సంస్క•త భాషలో అహశ్చ రాత్రిశ్చ అనే ద్వంద్వ సమాసంలో అహోరాత్రి శబ్దంపై ‘అ’ ప్రత్యయం వచ్చి అహోరాత్ర అవుతుంది. దీన్ని తెలుగులో అదే అర్థంలో వాడాలంటే అహోరాత్రం అని మాత్రమే అనాలి. అంటే అకారంతో ఈ పదం వాడుక ముగియాలి. అంతే తప్ప అహోరాత్రులు లేదా అహోరాత్రుళ్లు అని ఇకారాంత రూపంతో ముగిసేలా ఈ పదాన్ని వాడకూడదు.

‘‘సపరివార సమేతంగా..’’ అనే పదాన్ని ఎలా ఉపయోగించాలి?

‘బంధుమిత్ర సపరివార సమేతంగా వివాహానికి వచ్చి మమ్మానందింప జేయగలరు’.. ఈ వాక్యం శుభలేఖల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సపరివార సమేతంగా అనేది తప్పు. ఇందులోని సపరివారం, సమేతం రెండు పదాలు ఒకే అర్థం కలవి. రెండింటి అర్థం కలిపి అనే అలాం టప్పుడు సపరివారంగా అనో, పరివార సమేతంగా అనో అంటే సరిపోతుంది. బంధుమిత్ర సపరివార సమేతంగా అనే సమాసాన్ని సబంధుమిత్ర పరివారంగా అనో అంటే దోషం ఉండదు. ప్రస్తుతం మనం దీన్ని వాడుతున్న విధానమైతే సరికాదు.

‘‘పతాకం’’ అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్న విధానం సరైనదేనా?

జాతీయ పతాకం మొదలైన పదబంధాల్లో ఈ పదం బాగా వాడుకలో ఉంది. సంస్క•తంలో పతాక శబ్దం అకారాంత స్త్రీ లింగం. దీన్ని అదే భావనలతో తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు పతాక అవుతుంది తప్ప పతాకం అవదు. కానీ తెలుగు నాట పతాకం అనే విరివిగా వాడేస్తున్నాం.

Review పిల్లలూ.. వాడే ముందు తెలుసుకోండి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top