
చిన్నారి లోకం అద్భుతం
నవంబర్ సంచికలో ప్రచురించిన ‘చిన్నారి లోకం’ చాలా బాగుంది. ప్రస్తుతం పిల్లలంటే చదివే యంత్రాలుగానే మారిపోయారు. అయితే, చదువొక్కటే వారికి బతకడం నేర్పదు. విజయ వంతంగా జీవించడానికి అవసరమైన వన రులను, శక్తియుక్తుల్ని, లోకజ్ఞానాన్ని వారికి వారు సముపార్జించుకునేలా తల్లిదండ్రులు, గురువులే వారికి మార్గనిర్దేశం చేయాలని చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎంతగానో చది విస్తుంది.. అలరిస్తుంది. పత్రికను ఇంత అద్భు తంగా తీసుకువస్తున్న యాజమాన్యానికి అభి నందనలు.
-శ్రీబాల, నీరజ్, ఐశ్వర్య, రాంప్రసాద్.కె., వినీత.ఏ., కవితా ఆనంద్.పి. మరికొందరు ఆస్టిన్‍వాసులు మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
పిల్లల ఆహారం సూపర్
నేటితరం పిల్లలు పౌష్టికాహారం బదులు స్పైసీ, ఫాస్ట్ఫుడ్‍కి ఎక్కువగా అలవాటు పడు తున్నారు. వాటివల్ల ఊబకాయం, పౌష్టికాహార లోపం, బలహీనత వంటి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే పిల్లలు మధుమేహం బారిన కూడా పడుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలి? పౌష్టికా హారాన్ని ఎలా అందించాలి? వాటి ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను చక్కగా వివరించిన ‘పిల్లలు ఏం తింటున్నారు’ వంటి శీర్షికను అందించిన తెలుగుపత్రికకు అభినందనలు. ఇంకా పిల్లలకు సంబంధించిన ఇలాంటి శీర్షికలను వచ్చే సంచికలలో మరిన్ని ప్రచురించగలరని మా మనవి.
-వెంకట్, తిరుపతి, సౌమ్య, లలిత- గుంటూరు, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
పిల్లల స్పెషల్ అదుర్స్!
చిన్నారి బోసినవ్వుల గురించి గత సంచికలో వచ్చిన ‘బోసి నవ్వుల దేవుళ్లు!’ చాలా బాగుంది. పిల్లల మనస్తత్వాన్ని చాలా చక్కగా, పొయెటిక్‍గా చెప్పారు. చిన్నారిలోకం శీర్షిక పేరిట పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలనే విధానాన్ని చాలా చక్కగా చెప్పారు. అంతేకాకుండా మధ్య మధ్యలో బాక్స్ ఐటెమ్స్గా ప్రచురించిన నీతి కథలు చాలా బాగున్నాయి.
-స్వాతి, ప్రవీణ్, వికాస్- టెక్సాస్,
భరత్, ప్రవల్లిక – హైదరాబాద్•
మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
Review ఉత్తరాయణం.