ఉత్తరాయణం

అక్కడ మోదీ.. ఇక్కడ జగన్‍
నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి గెలు పొంది భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం. పది సంవత్సరాల ఒంటరి పోరాటం అనంతరం ఆంధప్రదేశ్‍లో రికార్డు స్థాయి వి•యాన్ని సాధించి అధికారంలోకి రావడం గురించి జూలై మాసం తెలుగు పత్రికలో విశ్లేషించిన తీరు బాగుంది. వీరిద్దరి విజయానికి కారణమైన అంశాలను చక్కగా వివరించారు. మొత్తానికి లోక్‍సభ, శాసనసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. దేశంలో వివిధ పార్టీలు సాధించిన విజయాలు ఉత్కంఠభరిత సినిమా కథను తలపించాయి. అంచనాలను తలకిందులు చేస్తూ, ఎగ్జిట్‍ పోల్స్ ఫలితాలను తలదన్నుతూ కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైఎస్‍ఆర్‍ కాంగ్రెస్‍ పార్టీ, తమిళనాడులో డీఎంకే, ఒడిశాలో బిజూ జనతాదళ్‍ పార్టీలు సాధించిన విజయాలు అంచనాలకు, ఊహకు అందనివి. అందుకే భారత ప్రజానీకానికి మరోసారి హాట్సాఫ్‍.
– రంజిత్‍కుమార్‍, అశోక్‍, సినిశెట్టి కుమార్‍, మరిడేశ్‍ ఆచంట మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

అప్పనపల్లి బాలాజీ
తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లి గ్రామంలో వెలసిన బాల వేంకటేశ్వరస్వామి పుణ్య క్షేత్ర విశేషాలు భలే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కంటే ముందుగా తొలిసారిగా ఇక్కడే నిత్యాన్నదానం ప్రారంభమైందనే విషయం తెలిసి ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇది ఈ క్షేత్రానికి గర్వ కారణమే. ఇటువంటి పుణ్య క్షేత్రాల గడ్డ మన ఆంధ్రావని కావడం ఎంతైనా విశేషం. ఆధ్యాత్మిక వికాసం, మాసం – విశేషం, పలుకుబడి, సామెతలు, సూపర్‍డిష్‍, సంపాదకీయం పేజీలు, ఇతర శీర్షికలు పత్రికకు వన్నె తెస్తున్నాయి.
– రాజ్‍కిరణ్‍, మల్లికార్జున్‍- సిరిసిల్ల, అడపా విశేష్‍- విజయవాడ, యాదగిరి, నవీన్‍, చాకరిమెట్ల వినయ్‍- హైదరాబాద్‍, రాజబాబు, అదితి, నిర్మల మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

ఆధ్యాత్మిక వాహిని..

‘తెలుగు పత్రిక’ అంతర్జాతీయ ఆధ్యాత్మిక మాస పత్రిక నిజంగా ఒక ఆధ్యాత్మిక ధారావాహిని. అటు తెలుగు భాష, సంస్క•తీ సంప్రదాయాలను ఇటు ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రచారం చేస్తూ వినూత్న శీర్షికలతో ముందుకు సాగుతోంది తెలుగు పత్రిక. ప్రస్తుత తరానికి, రాబోయే తరానికి కూడా ఈ పత్రిక ద్వారా ఎనలేని సేవ చేస్తున్నారు. మన సంస్క•తీ సంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడుతున్న తెలుగు పత్రికకు మనస్ఫూర్తిగా అభినందనలు.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top