అక్టోబరు మాసం తెలుగు పత్రికలో దసరా, దీపావళి వైభవాల గురించి వివరిస్తూ జంట పండుగల వైభవాన్ని కళ్లకు కట్టారు. ఈ శీర్షికన అందించిన విశేషాలు కొత్తగా, చదివించేలా ఉన్నాయి. అలాగే, దసరా షిర్డీ సాయిబాబా పుణ్యతిథి కూడా. ఈ సందర్భంగా షిర్డీలో జరిగే ప్రత్యేక పూజల, కార్యక్రమాల షెడ్యూల్‍ను సవివరంగా తెలియ చేశారు. అక్టోబరు సంచిక మమ్మల్ని అందరినీ అలరించింది.
-ఏ.కృష్ణమూర్తి, రాధారవి, పి.శేఖర్, షణ్ముఖరాజు- హైదరాబాద్, సంపత్, అనూరాధ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
కడుపుబ్బా నవ్వించారు
అక్టోబరు తెలుగుపత్రిక సంచికలో అందించిన జంధ్యాల జోక్స్ కడుపుబ్బా నవ్వించాయి. సున్నితమైన హాస్యానికి పెట్టింది పేరైన జంధ్యాల గారు చాలా కాలం తరువాత గుర్తుకు వచ్చారు. ఇటువంటి జోక్స్ మరిన్ని అందించే ప్రయత్నం చేయండి. అలాగే, తెలుగు పత్రిక విశిష్టతను వర్ణిస్తూ ఇచ్చిన కవిత కూడా బాగుంది.
-పెన్మత్స రఘు- పాలకొల్లు, ఆర్.విజయేందర్- హైదరాబాద్, పి.నాగేశ్వరి, వెంకటరమణ, జయ్, జగపతి ప్రసాద్, మరికొందరు పాఠకులు ఈ-మెయిల్ ద్వారా
విలువైన సంపద
తెలుగు పత్రికలో సమయానుగుణంగా, సందర్భానుసారంగా ఆయా పర్వాలు, పండుగలు, వేడుకల గురించి విశేషమైన సమాచారాన్ని అందిస్తున్నారు. విదేశాల్లో ఉండే తెలుగు వారికి ఈ వివరాలు ఎంతో ఉపకరిస్తాయి. మరీ ముఖ్యంగా నేటి తరానికి ఇవి విలువైన సమాచారాన్ని అందిస్తు న్నాయి.
– కైలాష్.కె., టెక్సాస్, స్వరూప, రమణ్, కిరణ్‍కుమార్- హైదరాబాద్
వికాసం..
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక సంచికలో అందిస్తున్న ఆధ్యాత్మిక వికాసం శీర్షిక ఎంతో ఉపయుక్తమైనది. ఇంకా ఆధ్యాత్మిక కథ, పిల్లల కథలు వంటివి నీతి నియమాలను నేర్పుతూ నైతికతకు దోహదం చేస్తున్నాయి. ఇటువంటి విలువైన శీర్షికలు మరిన్ని అందించే ప్రయత్నం చేయండి.
Review ఉత్తరాయణం.