
తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన శివరాత్రి విశేషాలు ఎంతో బాగున్నాయి. లింగోద్భవ కాలం గురించి చాలా బాగా వివరించారు. మునుపెన్నడూ చదవని విశేషాలు తెలుగుపత్రికలో చదివి తెలుసుకున్నాం. శివరాత్రి వ్రతాచరణ, ఆరోగ్య రహస్యాలు, ఉపవాసం, జాగరణలో దాగి ఉన్న మర్మాల గురించి చాలా విపులంగా తెలిపారు. తెలుగు పత్రికలో వచ్చే వివిధ శీర్షికలు చదువుతుంటే, మన తెలుగు సంస్క•తి, సంప్రదాయాలను మన పెద్దలు ఎంత జాగ్రత్తగా ఆలోచించి మనకు అందించారో అర్థమవుతుంది. అవన్నీ ఈ తరంలోని వారికి తెలియ చెబుతున్న తెలుగు పత్రికకు శుభాభినందనలు.
-కె.శ్రీకాంత్‌రెడ్డి, రవికిరణ్‌వర్మ, పి.సునీల్, కామేశ్వరరావు, సంతోష్- హైదరాబాద్, రాజశేఖరరాజు, విజయ్‌కుమార్, చందుపట్ల రవి, పి.శ్రీనివాస్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
మొదటి పేజీ నుంచి..
తెలుగు పత్రిక అన్ని సంచికలు తొలి పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని శీర్షికలు, కథనాలు వివరణగా, విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి. అన్నీ చదివిస్తున్నాయి. ఆలోచింప చేస్తున్నాయి. మరిన్ని కొత్త శీర్షికలు ఇవ్వడానికి ప్రయత్నించాలని మనవి.
– ఆర్.సుధారాణి, రవి.కె.- టెక్సాస్, పవన్‌కుమార్, రామకృష్ణారావు- మరికొందరు ఈ-మెయిల్ ద్వారా
సంప్రదాయాలు సజీవంగా..
తెలుగు పత్రిక చదువుతుంటే మన సంస్క•తీ సంప్రదాయాలు సజీవంగా ఉన్నాయని అనిపిస్తోంది. అవి మన జీవధారలు. వాటిని జీవనదుల్లా మార్చుకుని మన జీవనవాహినిలో భాగం చేసుకోవాలి. అప్పుడే అవి ఇంకా పది కాలాల పాటు ఉనికిలో ఉంటాయి. ఈ బాధ్యత అందరిదీ.
– సిద్ధారావు, ప్రవీణ్‌కుమార్, ఆర్.సంజీవ్-హైదరాబాద్
Review ఉత్తరాయణం.