బైడెన్ పాఠం
తెలుగు పత్రిక జనవరి సంచికలో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‍పై ఇచ్చిన ముఖచిత్ర కథనం చాలా ఇన్‍స్పిరేషనల్‍గా ఉంది. జీవితం ఎవరికీ పూలబాట కాదని, కాకపోతే, నవ్వుతూనే ముళ్లబాట ప్రయాణాన్ని సాగించాలనే విషయం ఆయన జీవితాన్ని చదవడం ద్వారా అర్థమైంది. జీవితం చరమాంకంలో అత్యున్నత పదవిని అధిష్టించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం.
– రాఘవేంద్ర ప్రసాద్, సీహెచ్.అరవింద్,
టి.కనకరాజు, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
నల్ల కలువ
భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ అమెరికాలో ఉపాధ్యక్ష పదవిని అందుకోవడం, ఆమె జీవన ప్రస్థానం ఎంతగానో చదివించాయి. తలుచుకోవాలే కానీ, సాధ్యం కానీదేదీ లేదనేందుకు జో బైడెన్, కమలా హ్యారిస్ జీవితాలు నిదర్శనం.
– కోటేశ్వరరావు- తిరుపతి,
కె.మల్లేష్- హైదరాబాద్
భారతీయం
తెలుగు పత్రిక జనవరి 2021 సంచిక ఎంతో ప్రత్యేకం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ జీవితం విశేషాలు నేటి తరానికి పాఠాలు. అలాగే, అమెరికా రాజకీయాల్లో భారతీయుల పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.
– టి.రవి- హైదరాబాద్
Review ఉత్తరాయణం.