ఉత్తరాయణం

సూర్య నమస్కారాలు
తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో సూర్య నమస్కారాల గురించి అందించిన కథనం చాలా బాగుంది. మన ప్రాచీనులు ఎంతో ముందుచూపుతో ఆధ్యాత్మిక కోణంలో ఏర్పరిచిన నియమాలు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయో ఈ ఆర్టికల్‍ చదివాక తెలిసింది. సులభందా, సరళంగా ఉండే సూర్య నమస్కార భంగిమలు నేటి తరంలో అందరూ ఆచరించతగినవి. జిమ్‍లకు వెళ్లి గంటల కొద్దీ చేసే కసరత్తుల కంటే సూర్య నమస్కారాలు ఎన్నో రెట్లు మెరుగైనవి.

– క్రిష్‍- అట్లాంటా, పవన్‍- హైదరాబాద్‍,
బి.దొరబాబు- తిరుపతి, జి.రమేశ్‍, రఘురామ్‍, పి.సంతోష్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

రథ సప్తమి
మాఘ మాసంలో వచ్చే రథ సప్తమి గురించి వివరించిన శీర్షిక బాగుంది. తెలుగు పత్రికలో వచ్చే శీర్షికలు ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ కోణంలోనూ ఇవ్వడం బాగుంది.

– ఆర్‍.రఘునందన్‍, సుభాష్‍, పి.సుకుమార్‍
మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

విశేషం
తెలుగు పత్రిక లో అందించే మాసం – విశేషం మొత్తం పత్రికకే హైలైట్‍. తిథులను అనుసరించి వచ్చే పండుగలు, పర్వాలపై వివరాలు అందించడం బాగుంది.

– సుగుణ, హైదరాబాద్‍

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top