మాతృదేవోభవ
తెలుగు పత్రిక మే సంచికలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అందించిన విశేషాలు ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా పురాణాల్లోని అమ్మతనానికి అద్దం పట్టే తల్లి పాత్రలను పరిచయం చేయడం చాలా బాగుంది. ప్రతీ పేజీలో ఇచ్చిన వివరాలు చదివించాయి. ఇప్పటి వరకు మాకు తెలియని కొన్ని పురాణ పాత్రలు, అమ్మగా వారి ఔన్నత్యం గురించి కూడా తెలుసుకోగలిగాము.
– కె.వెంకటేశ్, రాజారవీంద్ర, పీహెచ్.భాను, ఆర్.విక్రమ్, టి.కవిత- హైదరాబాద్, శివప్రసాద్- తిరుపతి, ఎన్.కేశవ్- వరంగల్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
బుద్ధం శరణం
బుద్ధ పూర్ణిమ సందర్భంగా మే తెలుగు పత్రిక సంచికలో ఇచ్చిన ముఖచిత్ర కథనం బాగుంది. ఇంతకుముందు తెలియని విషయాలు తెలిశాయి. మనశ్శాంతిగా జీవించడానికి, సంఘం శ్రేయస్సు కాంక్షించడానికి బుద్ధుడు అందించిన బోధనలు నేటికీ ఆచరణీయం.
– వినోద్‍కుమార్, టీఆర్ వివేకానంద,- విజయవాడ, రావ్.సి.- అట్లాంటా, రోషిణి- హైదరాబాద్
జాతక కథలు
జాతక కథలు బాగున్నాయి. కథలు సంఘంపై అవగాహన కలిగించేలా ఉన్నాయి.
– రఘురామ్, ఒంగోలు
Review ఉత్తరాయణం.