ఉత్తరాయణం

ఇంకా చాలా కావాలి.
‘తెలుగు పత్రిక’లో చాలా వివరాలు అందిస్తున్నారు. సంతోషం. అయితే, ఇంకా చాలా కావాలని అనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైనా ప్రముఖ పర్యాటక ప్రాంతం, ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రం, మానసిక వికాసం కలిగించే శీర్షికలను కూడా ప్రవేశపెట్టండి. పాఠకుల యాత్రానుభవాలకు చోటివ్వండి. కథలు కూడా ఉంటే మంచిది. పురాణేతిహాస కథలు, ఇతరత్రా ఆధ్యాత్మిక సమాచారానికి, భాషా సంబంధమైన అంశాలకు మరింత ప్రాధాన్యం ఇచ్చే విశేషాలు అందించండి.
– రామకృష్ణ.కె., ఆస్టిన్‍, అమెరికా సంయుక్త రాష్టాలు

పండుగ విశేషాలు.
తెలుగు నాట పండుగ పర్వాలకు పెద్దపీట వేస్తుంటారు. మన సామాజిక జీవనం వాటితోనే ముడిపడి ఉంది. కాబట్టి ప్రతి నెలా తెలుగు పత్రిక సంచికలో ఆ నెలలో వచ్చే ముఖ్య పండుగలు, పర్వాల గురించి వివరంగా ఇస్తే బాగుంటుందేమో పరిశీలించండి. అలాగే, ఆయా పండుగలు, పర్వాల్లోని విశిష్టతను, విశేషాలను నేటి తరానికి తెలియ చెప్పాల్సిన బాధ్యత ఇటువంటి పత్రికలపైనే ఉంది. ఈ బాధ్యతను తెలుగు పత్రిక విజయవంతంగా నెరవేర్చాలని, నెరవేరుస్తుందని ఆశిస్తూ..
– విజయ్‍ భూపాల్‍; టెక్సాస్‍, సంపత్‍.టి.కె.; కాలిఫోర్నియా,
అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి మరికొంతమంది

విభిన్న శీర్షికలు.
సామెత కథలు, నానుడి, పలుకుబడి వంటి శీర్షికలు మన తెలుగులోని గొప్పదనాన్ని, మాధుర్యాన్ని, విశిష్టతను తెలియ చెబుతున్నాయి. ఇటువంటి శీర్షికలు మరిన్ని ఇచ్చినా నేటి తరానికి ఉపయోగపడతాయి. అటు ఆధునిక విశేషాలను, ఇటు సంప్రదాయ విశిష్టతలను ఒకే పత్రికలో విజయవంతంగా అందించడం అభినందనీయం. ఇకముందు కూడా ఇలాగే ఈ ఒరవడిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
– రాంనరేష్‍, కళాధర్‍, మమత, రాజీవ్‍- ఆన్‍లైన్‍ పాఠకులు.

ఆధ్యాత్మిక వికాస
ఏప్రిల్‍ సంచికలో అందించిన ఆధ్యాత్మిక వికాసం బాగుంది. తెలుగు పత్రికలో అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. తెలియని ఎన్నో విషయాలను వీటి ద్వారా తెలుసుకోగలుగుతున్నాం.
– సుధ.టి.; మార్కెటింగ్‍ ఎగ్జిక్యూటివ్‍, సౌదీ అరేబియా

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top