
శివోహం
‘నేనే శివుడు.. నేనే జీవుడు’ అని తెలుసుకోవడమే శివత్త్త్వంలోని రహస్యం. ఈ విషయాన్ని మార్చి 2022 తెలుగుపత్రిక సంచికలో బాగా వివరించారు. మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, విశిష్టతను గురించి విపులంగా తెలిపారు.
– ఎన్.రాజారావు- కాకినాడ, కె.జయశంకర్- గుంటూరు,
పి.లక్ష్మీశంకర్, శ్రీలలిత, వినయ్, ఆర్.చందు
మరికొందరు ఆన్లైన్ పాఠకులు
సమానత్వం
తెలుగు పత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచురించిన రామానుజుల వారి ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ కవర్ స్టోరీ చదివించింది. వెయ్యేళ్ల క్రితమే రామానుజుల వారు మనుషుల్లో సమానత్వం కోసం పాటుబడ్డారని, అంటరానితనం నిర్మూలకు కృషి చేశారని తెలిసి ఆశ్చర్యం వేసింది. శ్రీరామనగరంలో వెలసిన ఈ అతి పెద్ద భారీ విగ్రహం గురించి విశేషాలు బాగున్నాయి.
– సంతోష్‌కుమార్- చిత్తూరు, ఆర్.ఉదయభాస్కర్- హైదరాబాద్, రవి.కె.ఆర్- కాలిఫోర్నియా,
రవిశంకర్- వరంగల
శీర్షికలు భేష్
తెలుగు సినిమాల విశేషాలు, మాసం- విశేషం, సామెతలు, పలుకుబడులు, శ్రీరాం గారి లేఖలు, పిల్లల, పెద్దల కథలు, ఆధ్యాత్మిక వికాసం వంటి శీర్షికలు చదివిస్తున్నాయి.
– కిరణ్, శ్రీపాద్, కవిత (ఈ-మెయిల్ ద్వారా)
Review ఉత్తరాయణం.