ఉత్తరాయణం

టీచర్స్ డే
తెలుగు పత్రిక సెప్టెంబరు సంచికలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల ప్రాముఖ్యత, విద్యార్థులను తీర్చిదిద్దడంలో వారి పాత్ర గురించి చాలా బాగా వివరించారు. ఈ ముఖచిత్ర కథనం చాలా ఇన్‍స్పైరింగ్‍ కలిగించేదిగా ఉంది. అంతేకాకుండా, ‘జీవితంలో మనకు ఎదురుయ్యే ప్రతి వ్యక్తి తన అనుభవాలు చెబుతారు.. వారు కూడా ఉపాధ్యాయులే’ అంటూ సూత్రీకరించడం బాగుంది.
– నందేశ్వరరావు- విజయవాడ, వెంకటపతి; విష్ణు, జయశంకర్‍- హైదరాబాద్‍

పండుగల ప్రత్యేకం
సెప్టెంబరు మాసంలో వచ్చిన వరుస పండుగల గురించి మాసం విశేషం శీర్షికతో పాటు ఈ మాసం ప్రత్యేకం కింద అందించిన వివరాలు చదివించాయి. శ్రీకృష్ణాష్టమి, శ్రావణ మాస విశేషాలు, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, రక్షాబంధన్‍ వేడుకలను క్లుప్తంగా వివరించడం బాగుంది.
– పి.రవిచంద్ర-తిరుపతి, కమల్‍, కవిత మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

సినిమాలు
సినిమాల సమాచారంలో ఎక్కువగా తెలుగు సినిమాలవే ఇస్తున్నారు. తమిళం, మలయాళం, హిందీ సినిమాల సమాచారాన్ని కూడా అందిస్తే బాగుంటుంది.
– రాజశేఖర్‍రావు, విజయవాడ

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top